నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌ళ్లీ.. జ‌గ‌న్‌తోనే ప‌ని.. మ‌రో వివాదం త‌ప్ప‌దా ?

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కుమానిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ర్ కు ప్ర‌భుత్వ అధినేత‌, వైసీపీ చీఫ్ జ‌గ‌న్‌కు మ‌ధ్య విభేదాలు వివాదాలు అంద‌రికీ తెలిసిందే.స్థానిక ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డంపై జ‌గ‌న్ గ‌త ఏఆది తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.అంతేకాదు, ఏకంగా నిమ్మ‌గ‌డ్డ కులాన్ని రోడ్డు మీద‌కు లాగేశారు.“చంద్ర‌బాబు క‌మ్మ‌. నిమ్మ‌గ‌డ్డ క‌మ్మ‌.కాబ‌ట్టే బాబుకు అనుకూలంగా ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు“ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.

 Back To Nimmagadda .. Work With Jagan .. Is Another Conflict Wrong?, Ap, Ap Poli-TeluguStop.com

క‌ట్ చేస్తే.

ఆత‌ర్వాత నుంచి నిమ్మ‌గ‌డ్డ వ‌ర్సెస్ జ‌గ‌న్‌.మ‌ధ్య అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.అయితే.ఎటొచ్చీ.నిమ్మ‌గ‌డ్డ .రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్నందున జ‌గ‌న్ ఏం చేస్తున్నా.ఇబ్బందులు ప‌డుతున్నారే త‌ప్ప‌.స‌మ‌స్య‌ల్లో మాత్రం చిక్కుకోలేక‌పోతున్నారు.ఇలా ఉన్న వీరిద్ద‌రి విష‌యంలో ఇప్పుడు నిమ్మ‌గ‌డ్డ‌కే జ‌గ‌న్‌తో ప‌ని ఏర్ప‌డింద‌ని అంటున్నారు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు చెందిన అధికారులు.“మా సార్ ఆ రెండు నిర్ణ‌యాలు తీసుకునే ముందు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది!“ అని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని క‌మిష‌న్ అధికారి ఒక‌రు వ్యాఖ్యానించారు.

Telugu Ap, War, Ysrcp-Telugu Political News

దీంతో విష‌యం ఏంట‌నిఆరాతీస్తే.ఇటీవ‌ల ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో ఇద్ద‌రు కీల‌క అధికారుల‌ను నిమ్మ‌గ‌డ్డ త‌న‌కున్న విశేషాధికారాల‌తో ప‌క్క‌న పెట్టారు.రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో జాయింట్ డైరెక్ట‌ర్ హోదాలో ఉన్న జీవీ సాయి ప్ర‌సాద్‌పై నిమ్మ‌గ‌డ్డ వేటు వేశారు.ఆయ‌నను ఏకంగా స‌ద‌రు ప‌ద‌వి నుంచి డిస్మిస్ చేశారు.

ఇక‌, క‌మిష‌న్‌లో కార్య‌ద‌ర్శిగా ఉన్న‌(నిమ‌గ‌డ్డ త‌ర్వాత అంత‌టి స్థాయి) సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వాణీమోహ‌న్‌ను కూడా త‌న‌కు అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వానికి స‌రెండర్ చేసేశారు.త‌న‌కు వ్య‌తిరేకంగా.

ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఈ ఇద్ద‌రూ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది నిమ్మ‌గ‌డ్డ భావ‌న‌.

అయితే.

వీరిద్ద‌రినీ తొల‌గించ‌డం వ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డ ఒక‌ర‌కంగా.జ‌గ‌న్‌పై పైచేయిసాధించార‌నే అనుకుందాం.

కానీ, పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లోను, అధికారుల‌ను రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌న్వ‌యం చేయ‌డంలోను ఈ ఇద్ద‌రూ కీల‌క అధికారులు.సో.వీరి స్థానంలో కొత్త‌వారిని తీసుకోకుండా.ఆయా స్థానాల‌ను ఖాళీగా ఉంచి.

ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి లేదు.దీంతో ఆ రెండు స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సిందిగా తిరిగి నిమ్మ‌గ‌డ్డ ప్ర‌భుత్వాన్నే కోర‌నున్న‌ట్టు స‌ద‌రు అధికారి తెలిపారు.

ఇక‌, దీంతో ప్ర‌భుత్వం ఎవ‌రికి అవ‌కాశం ఇచ్చినా.వారు.

ఖ‌చ్చితంగా స‌ర్కారుకు అనుకూలంగా నే ఉంటార‌ని ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నారు.మొత్తానికి జ‌గ‌న్‌తో నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌రో పంచాయ‌తీ ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube