మహిళలపై పగబట్టిన బిగ్ బాస్.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ మా ఛానెల్ లో సక్సెస్ ఫుల్ గా టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగు పెట్టిన ఈ షోలో నిన్నటి ఎలిమినేషన్ ప్రక్రియలో అరియానా, అభిజిత్, మోనాల్, లాస్య, హారిక, దివి, కుమార్ సాయి, అఖిల్, నోయల్ నామినేట్ అయ్యారు.

 Back To Back Eliminations Of Ladies From Bigg Boss House,  Bigg Boss House,nagar-TeluguStop.com

అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల జాబితాను పరిశీలిస్తే ఏకంగా ఐదు మంది లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం గమనార్హం.

సీజన్ 4 లో తొలి వారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా రెండో వారం కరాటే కల్యాణి, మూడో వారం దేవి నాగవల్లి, నాలుగో వారం స్వాతి దీక్షిత్, ఐదో వారం గంగవ్వ, జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయ్యారు.

ఇలా వరుసగా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ అభిమానులు షోపై ఆసక్తి తగ్గిపోతుందని చెబుతున్నారు.అంతో ఇంతో ప్రేక్షకులను ఆలరిస్తున్న కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు నెటిజన్లైతే సరదాగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ మహిళలపై పగబట్టాడని కామెంట్లు చేస్తున్నారు.గత సీజన్లలా ఈ సీజన్ లో పెద్దగా గుర్తింపు తెచ్చుకున్న లేడీ కంటెస్టెంట్లు లేకపోవడం కూడా షోకు మైనస్ గా మారిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం మోనాల్ గజ్జర్, హారిక, దివి, అరియానా గ్లోరీ, లాస్య ఉన్నారు.వీరిలో హారిక, మోనాల్ లవ్ ట్రాకులతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

లాస్య హౌస్ లో ఎక్కువ సమయం వంటింటికే కేటాయిస్తోంది.దివి, అమ్మ రాజశేఖర్ సాయంతో టాస్కుల్లో పోరాడుతుండగా అరియానా టాస్కులపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

మరోవైపు బిగ్ బాస్ రేటింగ్స్ క్రమంగా తగ్గుతున్నాయి.బిగ్ బాస్ ఈ వారమైనా మేల్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తాడో లేక మళ్లీ ఫిమేల్ కంటెస్టెంట్ నే ఎలిమినేట్ చేస్తాడో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube