టాలీవుడ్‌ లో సెప్టెంబర్ నుండి పెద్ద పండుగలు రాబోతున్నాయి

టాలీవుడ్ సెకండ్ వేవ్‌ నుండి పూర్తగా బయట పడ్డట్లుగానే కనిపిస్తుంది.ఇప్పటికే షూటింగ్ లు పునః ప్రారంభం అయ్యాయి.

 Back To Back Big Movie Releasing In Next Month,latest Tollywood News-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాలు రాలేదు కాని ఆగస్టు నెలలో చిన్న సినిమాలు క్యూ కట్టాయి.ఈ నెల ఆరంభం నుండి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.

బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకున్న సినిమాలు అయితే లేవు కాని మంచి వసూళ్లు మాత్రం వస్తున్నాయి.ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాకు అయిదు కోట్లు వచ్చాయట.

ఇక నేడు విడుదల అయిన రాజ రాజ చోర సినిమాకు కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాలను ఇక వచ్చే నెల నుండి రంగంలోకి దించబోతున్నారు.

Telugu Corona Wave, Telugu, Tollywood-Movie

మొదటగా సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే గల్లీ రౌడీ, డియర్ మేఘ మరియు 101 జిల్లాల అందగాడు సినిమాలు రాబోతున్నాయి.ఈ సినిమాలకు తోడుగా మరే పెద్ద సినిమా అయినా జత అయ్యే అవకాశం ఉంది.ఇక ఆ తర్వాత వారం అంటే సెప్టెంబర్‌ 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న లవ్‌ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పలు సినిమాలు కూడా సెప్టెంబర్ లో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.

సెప్టెంబర్‌ నుండి మళ్లీ మొదలు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లతో పాటు బాక్సాఫీస్ గలగల ఇక నుండి మళ్లీ థియేటర్ల వద్ద కనిపించబోతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ల వద్ద సందడి కనిపించగా ఏడాదిన్నర కాబోతుంది.ఇప్పటికే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కు వచ్చినా కూడా గత ఏడాది తర్వాతే.మద్యలో రెండు మూడు సినిమాలు వచ్చినా వాటి స్థాయి చిన్నది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube