బ్యాచిలర్ లైఫ్ బెస్ట్ అనుకున్న స్టార్ సెలబ్రేటీస్ వీళ్ళే!

Bachelor Life Best Wanted Star Celebrities

ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ చాలానే ఉన్నట్టు తెలుస్తోంది.పెళ్లి అనే ఈ మాటంటే సినిమా రంగంలోనే ఎక్కువగా ఉన్నప్పటికీ బయట కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు.

 Bachelor Life Best Wanted Star Celebrities-TeluguStop.com

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్స్ విషయానికొస్తే, ముందుగా అందరికీ గుర్తొచ్చే నటుడు ప్రభాస్. ఆయన వయసు 42ఏళ్లు.

రామ్ పోతినేని, అక్కినేని అఖిల్, శర్వానంద్ లాంటి నటులు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నట్టు తెలుస్తోంది.వీళ్లే కాకుండా పాత తరం నటులు కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉన్నారు.

 Bachelor Life Best Wanted Star Celebrities-బ్యాచిలర్ లైఫ్ బెస్ట్ అనుకున్న స్టార్ సెలబ్రేటీస్ వీళ్ళే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాటి శోభన నుంచి నాటి అనుష్క దాకా అదే బాటలో పయనిస్తున్నారు.తమన్నా, త్రిషలు కూడా సోలో బతుకే సో బెటర్‌ అని అనుకుంటున్నట్టు ఉంది వీళ్లందర్నీ చూస్తుంటే అని నెటిజన్స్ టాక్.

ఇకపోతే పెళ్లి చేసుకున్న తారలు సుఖంగా ఉన్నారా అంటే, అదీ లేదు.ఆ పెళ్లిల్లు కాస్తా పెటాకులుగా మారుతున్నాయి.సాధారణంగా డబ్బున్న కుటుంబాల్లో ఎలాంటి సమస్యలూ ఉండవని అనుకుంటారు.కానీ అది నిజం కాదు.

ఎన్నో సందర్భాల్లో ఈ విషయం రుజువైంది కూడా.మన తెలుగు పరిశ్రమలో చూసుకుంటే ఆదర్శంగా నిలిచిన దాంపత్యం అంటే గుర్తొచ్చే జంట కృష్ణ, విజయనిర్మల.

నాటి తరంలో సినిమా పెళ్లిళ్లు చాలా జరిగినా ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవలేదు.శరత్ బాబు, రమ ప్రభల జంట కూడా అందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

Telugu Akkineni Akhil, Anushka Shetty, Bachelor Life Best, Krishna, Prabhas, Ram Pothineni, Salman Khan, Sharath Babu, Tamanna, Trisha-Movie

ఇదిలా ఉండగా, తెలుగులో ప్రభాస్‌ ఎలాగో, హిందీలో సల్మాన్ ఖాన్‌ కూడా అదే బాటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.వీరికి సినిమా వాళ్లని అమ్మాయిని ఇవ్వడంలేదా ? లేదంటే వీళ్లే పెళ్లికి దూరంగా ఉంటున్నారా అనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.కొన్నిసార్లు కొందరు హీరోయిన్లతో సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తలు కూడా వీరి పెళ్లికి అడ్డంకిగా మారుతుండొచ్చు.పెళ్లి చేసుకుని విడిపోయేకంటే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉంటే బెటర్ అనే అభిప్రాయం వీళ్లకు ఉందేమో అనిపిస్తోంది ఒక్కోసారి.

#Akkineni Akhil #Anushka Shetty #Prabhas #Krishna #Sharath Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube