తెలుగమ్మాయి అయినప్పటికీ తెలుగుతో పోలిస్తే కన్నడ సినిమాల్లో నటించి నటిగా బేబీ వరలక్ష్మి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ప్రస్తుతం సినిమాల కంటే సీరియళ్లలో ఎక్కువగా నటిస్తున్న బేబీ వరలక్ష్మి భీమవరంకు చెందిన వారు.
కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న బేబీ వరలక్ష్మి చిన్న వయస్సులోనే సినిమా ఆఫర్లు రావడంతో ఉన్నత చదువులు చదువుకోవడం సాధ్యపడలేదు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సినిమా రంగానికి చెందిన వాళ్లనే పెళ్లి చేసుకుంటారు.
అయితే వరలక్ష్మి మాత్రం తమిళియన్ ను పెళ్లి చేసుకున్నారు.వరలక్ష్మి పుట్టింది భీమవరంలో అయినా పెరిగింది మాత్రం చెన్నైలోనే కావడం గమనార్హం.
మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన చిట్టెమ్మ మొగుడు సినిమా తర్వాత వరలక్ష్మి సినిమాలలో ఎక్కువగా నటించలేదు.ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో వరలక్ష్మి గర్భవతి పాత్రను పోషించారు.

ఈ పాత్రను పోషించే సమయానికి వరలక్ష్మి రియల్ లైఫ్ లో కూడా గర్భవతి కావడం గమనార్హం.ఆ సినిమాలో ఒక సన్నివేశం ప్రకారం వరలక్ష్మి అరటితొక్కపై కాలు వేసి కింద పడాలి.అయితే ఆ సన్నివేశానికి వరలక్ష్మి ఏకంగా 11 టేకులు తీసుకున్నారు.ఎన్నిసార్లు చేసినా సీన్ ఓకే కాకపోవడంతో వరలక్ష్మి ఏడ్చేశారు.ఆ తర్వాత వరలక్ష్మి తాను రియల్ లైఫ్ లో కూడా గర్భవతినని దర్శకునికి చెప్పారు.

ఆ తర్వాత దర్శకుడు అప్పటికే తీసిన షాట్ లలో ఒకటి ఓకే చేస్తానని చెప్పి షూటింగ్ కు ప్యాకప్ చెప్పారు.ఆ తర్వాత బిడ్డ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చారు.తనకు ఇబ్బంది లేని సినిమాలకు మాత్రమే ఓకే చెప్పి కొన్ని సినిమాల్లో మాత్రమే ఆమె నటించడం గమనార్హం.
సీరియళ్ల ద్వారా కూడా వరలక్ష్మి మంచి పేరు తెచ్చుకున్నారు.