నెటిజన్లను ఆకట్టుకున్న పాప రియాక్షన్  

baby smiles after hearing aids turned on - Telugu Baby, Baby Smile, Hearing Aids, Smile, Viral News, Weird News

పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న ఓ పసిపాప తొలిసారి తన తల్లి మాటలు విని ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు పసిపాప తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ పాప రియాక్షన్‌కు ఫిదా అవుతున్నారు.

 Baby Smiles After Hearing Aids Turned On

ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌కు చెందిన జార్జినా అనే నాలుగు నెలల పాపకు పుట్టుకతోనే వినికిడిలోపం ఉంది.దీంతో ఆ పాప తల్లిదండ్రులు పాపకు వినికిడి యంత్రాలు అమర్చారు.

వాటి సహాయంతో ఆ పాప శబ్దాలను వినగలగుతోంది.అయితే ఆ యంత్రాలు అమర్చిన వెంటనే తన తల్లి మాటలు విన్న పసిపాప అందంగా నవ్వుతూ ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

తమ పాప తమ మాటలను వినగలుగుతోందని ఆ తల్లి పెట్టిన పోస్టుకు నెటిజన్లు ప్రశంసలు, అభినందనలు తెలుపుతూ తెగ షేర్ చేస్తున్నారు.పాప చాలా బాగుందని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలంటూ వారు భగవంతుడిని కోరుకుంటున్నారు.

#Hearing Aids #Baby #Baby Smile #Smile

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Baby Smiles After Hearing Aids Turned On Related Telugu News,Photos/Pics,Images..