పెంపుడు కుక్క‌కు శ్రీమంతం.. ఇదెక్క‌డి విడ్డూరం..

పెట్ ల‌వ‌ర్స్‌కు వాటి మీద ఉండే ప్రేమ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.చాలామంది ప్ర‌జ‌లు పెంపుడు జంతువుల‌ను అచ్చం ఇంట్లో మ‌నుషుల్లాగే చూసుకుంటారు.

 Baby Shower For A Pet Dog This Is Very Strange-TeluguStop.com

త‌మ ప్రేమ‌ను వాటిమీద నిత్యం కురిపిస్తూనే ఉంటారు.జంతువుల‌కు కూడా అచ్చం మ‌నుషుల్లాగే బ‌ర్త్ డే వేడుక‌లు చేయ‌డం మ‌నం ఎప్ప‌టి నుంచో చూస్తూనే ఉన్నాం.

ఈ విధ‌మైన సాంప్ర‌దాయం మ‌న‌కు ప‌ల్లె టూర్ల‌లో క‌న్నా కూడా సిటీల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది.ఇలా పెట్స్‌ను పెంచుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

 Baby Shower For A Pet Dog This Is Very Strange-పెంపుడు కుక్క‌కు శ్రీమంతం.. ఇదెక్క‌డి విడ్డూరం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పుడు ఓ కుంటుంబం త‌మ పెంపుడు కుక్క‌మీద ఉన్న ప్రేమ‌ను చాలా విచిత్రంగా చూపించారు.అదేంటంటే ఇంత వ‌ర‌కు మ‌నం పెంపుడు కుక్కలకు బ‌ర్త్ డే వేడుకలు చేయ‌డం చాలా చూస్తూనే ఉన్నాం.

ఇది స‌ర్వ సాధార‌ణం అయిపోయింది.కాగా ఓ కుటుంబం అయితే కొంచెం డిఫ‌రెంట్‌గా ఆలోచించిం వారి కుక్కకు శ్రీమంతం జ‌ర‌ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.

మ‌న ప‌క్క‌నే ఉండే తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.ఈ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఇలా చేసింది.

Telugu Dog Pregnant, Pet Dog, Pet Lovers, Silk Dog, Sreemantham For Pet Dog, Strange Ritual For Pet Dog, Tamil Nadu, Teni District, Viral News-Latest News - Telugu

త‌మ పెంపుడు కుక్కను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.ఇక కుక్క‌కు శ్రీమంతం చేసేందుకు రెడీ అయిపోయారు.ఈ వైర‌ల్ వీడియో చూస్తే కుక్కకు మెడ చుట్టూ ఎర్రటి క‌ల‌ర్ లో ఉండే ఒక బ‌ట్ట‌ను చుట్టారు.ఆ త‌ర్వాత దాని ముందు పండ్లు, గాజులతో పాటుగా పసుపు, కుంకుమలు ఉంచి అచ్చం ఆడ‌వారికి జ‌రిపించేలాగే శ్రీమంతం చేస్తున్నారు.

వీరి ఇంట్లో ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు కుక్క పిల్లలు ఉన్నాయంట‌.దాదాపు 10 వరకు కుక్క పిల్లలు ఉండ‌గా ఇందులో సిల్క్ కుక్క గ‌ర్భం దాల్చ‌గా దానికి ఇలా శ్రీమంతం చేశారు.

#Pet Lovers #Tamil Nadu #Teni #Silk Dog #SreemanthamPet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు