ఇదేందయ్యా ఇది: ఒంటి కన్ను చేపను చూశారా ఎప్పుడైనా మీరు..?

భూగ్రహం మీద 70 శాతం వరకు సముద్ర జలాలు మాత్రమే ఉన్నాయి.మిగతా 30 శాతం భూభాగంపై పర్వతాలు, లోయలు ఇలా మిగతా భూమి విస్తరించి ఉంది.

 Baby Shark With One Eye Shocks Fishermen, Cyclops Albino With One Eye, Shark Wit-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న జీవరాశి మొత్తం నీటిలోనే జన్మించిందంటూ చెప్పేవారు పెద్దవారు.అయితే ఇప్పటికీ మనకు సముద్రజలాల్లో కొన్ని వింత వింత జంతువులు మనం ఏదో ఒక సమయంలో చూస్తూనే ఉంటాము.

ఇకపోతే తాజాగా ఇండోనేషియా దేశం జాలర్లకు ఓ వింత చేప కనబడింది.ఆ చేపకు ఒక్క కన్ను మాత్రమే ఉంది.

అది ఎలా అంటే చందమామ కథల్లో ఒంటి కన్ను రాక్షసుడు ఉంటాడు కదా.అచ్చం అలా ఆ చేపకి ఇరు వైపులా కాకుండా తల ముందు భాగంలో కన్ను ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు.

జాలర్లు చేపల వీటిలో భాగంగా సముద్రంలో ఓ పెద్ద చేపను పట్టుకున్నారు.వలలో ఆ షార్క్ పడగానే అది ప్రాణాలు విడిచింది.అయితే అలా చనిపోయిన షార్క్ చేప ను చివరికి దానిని కోసి ఐస్ బాక్స్ లో పెడదామని భావించారు.ఇందులో భాగంగానే ఆ షార్క్ పొట్ట కోసేశారు.

ఇలా పొట్ట కోయడంతో ఆ షార్క్ చేప పొట్టలో ఉన్న 3 పిల్లల షార్కులు బయటికి వచ్చాయి.ఈ మూడు పిల్ల షార్కులు కూడా చనిపోయాయి.

ఇకపోతే ఇలా బయటికి వచ్చిన షార్క్ పిల్ల చేపలలో మిగతా రెండు షార్క్ చేప పిల్లలు బాగానే ఉన్న ఒక చేప మాత్రమే ఇలా ఒంటికన్నుతో ఉందని జాలర్లు తెలిపారు.ఇది కాస్త విడ్డూరంగా కనిపించడంతో వారు సముద్ర విభాగానికి సంబంధించిన అధికారులకు సమాచారాన్ని తెలపగా.

వెంటనే దానిని పరీక్షించిన సైంటిస్టులు అదొక సైక్లోప్స్ అని గుర్తించారు.ఇకపోతే గ్రీక్ పురాణ కథలలో ఈ జాతికి చెందిన జీవులు ఉండేవని తెలుస్తోంది.

కాకపోతే ఆ షార్క్ చేప చాలా పెద్దగా ఉంటుందని వాటికి కేవలం ఒక్క కన్ను మాత్రమే ఉండి అది కూడా నుదుటి ముందు భాగంలో మాత్రమే కన్ను ఉంటుందని తెలిపారు.

సైంటిస్టులు పరిశీలించిన తర్వాత ఆ చేప కు అరుదైన సైక్లోపియా సమస్య ఉందని తెలిపారు.

ఇలాంటి సమస్య ఉన్న జీవులు గర్భంలో పెరిగే దశలోనే కొన్ని లోపాలతో జన్మిస్తాయని ఇలా 2000 జీవితంలో కేవలం ఒక జీవికి మాత్రమే ఇలాంటి సమస్య ఎదురవుతుందని చెప్పుకొచ్చారు.అంతేకాదు ఆ చేపకు అల్బినో సమస్య కూడా ఉందని తెలిపారు.

అందువల్లనే ఈ చేప చూడడానికి చాలా తెల్లగా ఉందని తెలిపారు.అయితే ఆ దేశం ప్రజలు ఇలాంటి చేపలు కనబడితే చెడు జరుగుతుందని నమ్ముతారు.

ముందు ముందు ప్రళయాలు, తుఫానులు వచ్చే సంకేతంగా వీటిని దేవుడు పంపిస్తారని కొందరు జాలర్లు అంటున్నారు.అయితే ఇవన్నీ ఉత్తి పుకార్లేనని సైంటిస్టులు కొట్టిపారేశారు.

ఒకవేళ ఇలాంటి జీవులు పుట్టిన అవి బయటికి రాగానే చనిపోతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube