చరిత్రను తిరగరాసిన వీడియోకు 1000 కోట్ల వ్యూస్.. కారణం ఏంటంటే..?!

యూట్యూబ్ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి.ప్రతి రోజు ఎన్నో రకాల వీడియోలు యూట్యూబ్ లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి.

 Baby Shark Video Trending On Youtube With 10 Billion Views Record Details, Histo-TeluguStop.com

ప్రతిరోజు లెక్కలేనన్ని వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.అయితే వాటిలో కొన్ని వీడియోలు బాగా పాపులర్ అయ్యి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ కూడా వస్తాయి.

ఈ క్రమంలోనే యూట్యూబ్‌ లో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలే బాగా పాపులర్ అవుతూ ఉంటాయి.కాగా ఇప్పుడు యూట్యూబ్ లో ఒక మ్యూజిక్ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది.

బేబీ షార్క్ డ్యాన్స్ అనే మ్యూజిక్ వీడియో ఏకంగా ఏకంగా 10 బిలియన్ అంటే 1000 కోట్ల వ్యూస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.

బేబీ షార్క్ వీడియో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియో కావడం విశేషం.అలాగే యూట్యూబ్ చరిత్రలోనే 10 బిలియన్ వ్యూస్ మైలురాయిని దాటిన ఫస్ట్ వీడియో ఇదే కావడం గమనార్హం.

ఇక ఈ వీడియో గురించిన విషయాలు చూస్తే ఈ వీడియోను దక్షిణ కొరియా ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన పింక్‌ ఫాంగ్ రూపొందించింది.

ఈ వీడియోలో చిన్న పిల్లలు కనిపించడంతో పాటు “బేబీ షార్క్, డూ, డూ, డూ.మామీ షార్క్ డూ, డూ, డూ, గ్రాండ్ మా షార్క్ డూ, డూ, డూ.’ అంటూ ఒక అద్భుతమైన పాట కూడా ప్లే అవుతుంది.పాటకి తగ్గట్టు పిల్లలతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో రంగు రంగుల చేపలు కూడా కనిపిస్తాయి.పిల్లలు కూడా భలే డాన్స్ చేస్తూ ఉంటారు.ఇంకా ఈ వీడియోను 2016, జులై 18న యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా ఈ వీడియోకి ఇప్పటివరకు ఏకంగా 10,014,400,609 వ్యూస్ రావడంతో పాటు మిలియన్ల సంఖ్యలో లైకులు కూడా వచ్చాయి.చిన్న పిల్లలు అయితే ఈ వీడియోను బాగా లైక్ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube