తన 'సినీ కెరీర్'ని బేబీ షామిలి అలా నాశనం చేసుకుంది!

బేబీ షామిలి జగదేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల‌రించిన ఈ ముద్దుగుమ్మ చిన్న‌త‌నం నుంచే త‌మిళ్, తెలుగు, మ‌ళ‌యాళం, క‌న్న‌డ ఇండ‌స్ట్రీ అభిమానుల్ని త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసింది.రెండేళ్ల వ‌య‌స్సులోనే ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అంజ‌లి సినిమాలో మెంటల్లీ ఛాలెంజ్ క్యార‌క్ట‌ర్’లో ప‌ర‌కాయ‌ ప్ర‌వేశం చేసి త‌న మొద‌టి సినిమాతో నేష‌న‌ల్ ఫిల్మ్ం అవార్డ్ ను సొంతం చేసుకుంది.

 Actress Baby Shamili With No Movie Offers, Baby Shamili, Jagadeka Veerudu Athilo-TeluguStop.com

‘టీనేజ్’లో క‌న్న‌డ అగ్ర‌హీరోలైన ముమ్మ‌ట్టి, మోహ‌న్ లాల్ తో పాటు అంబ‌రీష్, సితార‌, శృతి.గీతా మేఘ‌న వంటి తారల స‌ర‌స‌న యాక్ట్ చేసింది.ఇలా 1989 నుంచి రెండేళ్ల వ‌య‌స్సులోనే త‌న సినీ కెరియ‌ర్ ను కొన‌సాగించిన షామిలి 2002 వ‌ర‌కు వచ్చిన అన్ని సినిమాల్లో న‌టించింది.2009లో హీరోయిన్’గా తెలుగులో హీరో సిద్ధార్ద్ స‌ర‌స‌న యాక్ట్ చేసింది.ఆ త‌రువాత మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన షామిలికి 2018లో అమ్మమ్మ గారి ఇల్లు చివ‌రి సినిమా.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లు టాలెంట్ ఉన్నా ‘బ్యూటీ’ విష‌యంలో షామిలి వెన‌కబ‌డింద‌నే చెప్పుకోవాలి.

ముఖ్యంగా తెలుగులో షామిలి హీరోయిన్ గా తెర‌కెక్కిన ఓయ్ చిత్రంలో బాగా ఎబ్బెట్టుగా క‌నిపించ‌డంతో నెగిటీవ్ కామెంట్స్ వ‌చ్చాయి.దానికి తోడు సినిమా షూటింగ్ ల‌కు ఆల‌స్యంగా రావ‌డం, నిర్మాత‌ల్ని గొంత‌మ్మ కోర్కెల్ని కోర‌డంతో ఆమె ప‌క్క‌న పెట్టేశారట నిర్మాతలు.

ఆమె సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచే వ‌చ్చింది.అక్క షాలిని అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది.

చివ‌ర‌కు హీరో అజిత్ ను వివాహం చేసుకొని లైఫ్ ను లీడ్ చేస్తుంది.కానీ షామిలి మాత్రం ఇలాంటి ప్రవర్తనతో త‌న సినీ కెరియ‌ర్ ను నాశ‌నం చేసుకుందని ఇప్పటికి సినీ విశ్లేషకులు కామెంట్లు చేస్తుంటారు.

ఏది ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి హీరోయిన్ గా, హీరోగా అడుగుపెట్టినవారు ఎందుకో మరి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube