తండ్రి కాబోతున్న మన్ ప్రీత్.. భార్యతో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు!

టీమిండియా హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ గురించి తెలియని వారు ఉండరేమో.ఇటీవల ఆయన పేరు మారుమోగి పోయింది.

 Baby On Way Announces Manpreet Singh, Manpreet Singh, Hockey Skipper, Social Med-TeluguStop.com

ఒలంపిక్స్ లో మన దేశం తరుపున పాల్గొని కాంస్య పథకాన్ని మన దేశానికీ అందించాడు.మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా భారత హాకీ జట్టుకాంస్య పథకాన్ని సాధించి మన దేశానికీ ఎంతో గర్వకారణం అయ్యారు.

ఎప్పడు లేనంత ప్రతిభ చాటి అన్ని దేశాల క్రీడా ప్రపంచ మన్ననలు అందుకుని మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు.ఇంతకు ముందు హాకీ అంటే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేవారు.

కానీ రాను రాను మన దేశంలో హాకీ టీమ్ అంత ప్రతిభ చూపించలేక పోయారు.కానీ మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత మన దేశానికీ కాంస్య పథకం రావడంతో మళ్ళీ మన దేశానికీ పూర్వ వైభవం తీసుకువచ్చింది.

ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు మన్ ప్రీత్ సింగ్.ఇది పక్కన పెడితే మన్ ప్రీత్ సింగ్ ఒక గుడ్ న్యూస్ ను అభిమానులకు షేర్ చేసాడు.

ఆయన లైఫ్ లో జరిగిన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు.ఏవైనా గత ఏడాది మలేషియా కు చెందిన ఫ్రెండ్ అయినా ఇలి నజ్వా సిద్ధిఖీనీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పంజాబ్ సాంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది.

అయితే ఇప్పుడు తాను తండ్రి కాబోతున్న విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

తన భార్యతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపాడు.ఇద్దరు ఒకే డ్రెస్ కోడ్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని తెలిపాడు.

ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://twitter.com/manpreetpawar07/status/1443909050815582218?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1443909050815582218%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fsports%2Fbaby-on-way-announces-hockey-skipper-manpreet-singh-284834.html

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube