కేజ్రీవాల్ ప్రమాణస్వీకారంలో క్రేజీగా మారిన బేబీ మఫ్లర్ మ్యాన్  

Baby Mufflerman Steals The Show At Arvind Kejriwal\'s Oath - Telugu Arvind Kejriwal\\'s Oath, Baby Mufflerman Steals The Show, Delhi, Ram Leela Stadium

ఢిల్లీలో కేజ్రీవాల్ మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.అయితే ఈ వేడుకలలో కేజ్రీవాల్ తర్వాత అందరి దృష్టిని భాగా ఆకర్షించిన వ్యక్తి బేబీ మఫ్లర్ మ్యాన్.

Baby Mufflerman Steals The Show At Arvind Kejriwal\'s Oath - Telugu Arvind Kejriwal\\'s Oath, Baby Mufflerman Steals The Show, Delhi, Ram Leela Stadium-Political-Telugu Tollywood Photo Image

కేజ్రీవాల్ ఈ పిల్లాడిని ప్రమాణస్వీకారంకి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.దీంతో కేజ్రీవాల్ గెటప్ లోనే రామ్ లీలా మైదానంలో ఈ బుడతడు అందరి దృష్టిని ఆకర్షించాడు.

కేజ్రీవాల్‌ మాదిరిగా టోపీ, స్వెటర్‌, మఫ్లర్‌, కళ్లజోడుతో వచ్చిన ఈ బుడతడిని మీడియా వాళ్ళు కెమెరాలలో బంధించేందుకు పోటీ పడ్డారు.

ఈ చిన్నారి ఆట్రాక్షన్‌గా నిలవడంతో పిల్లవాడితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపించారు.

ఇక ఆప్‌ ఎమ్మెల్యేలు భగవత్‌మాన్‌, రాఘవ్‌ చద్దా, సోమ్‌నాథ్‌ భారతి వంటి వారు కూడా పిల్లాడితో ఫోటోలు దిగి ముద్దు చేశారు.అదే విధంగా మరికొంత మంది చిన్నారులు కూడా కేజ్రీవాల్‌ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా నిలిచారు.

ఇక బేబీ మఫ్లర్ మ్యాన్ తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికలలో సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అయ్యాడు.ఈ బుడతడు వీడియో ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియాలో మంచి మైలేజ్ వచ్చింది.

దీంతో కేజ్రీవాల్ టీం ఈ బుడతడుని ప్రమాణస్వీకారంకి ఆహ్వానించింది.ఇక ఈ బేబీ మఫ్లర్ మ్యాన్ వైరల్ అయిన తర్వాత కేజ్రీవాల్ గెటప్ వేసే చిన్నారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

ఇక రామ్ లీలా మైదానంలో కూడా చాలా మంది చిన్నారులు ఈ గెటప్ లో కనిపించి సందడి చేశారు.

తాజా వార్తలు