టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి సినిమాలైన వారసుడు, వీరసింహారెడ్డి సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.వారసుడు సినిమాలోని రంజితమే పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ పాటకు కడుపులో బిడ్డ డ్యాన్స్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
థమన్ షేర్ చేసిన ఈ వీడియోకు 15000కు పైగా లైక్స్ వచ్చాయి.
రంజితమే సాంగ్ ప్లే చేసిన సమయంలో నా బేబీ ప్రతిసారి డ్యాన్స్ చేస్తోందని బేబీ తల్లి చెప్పుకొచ్చారు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు థమన్ పాటకు ఎవరైనా డ్యాన్స్ చేయాల్సిందేనని కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న వీడియో గురించి థమన్ స్పందిస్తూ ఈ వీడియో చూసి నేను మధురానుభూతికి లోనయ్యానని తెలిపారు.
ఈ వీడియో నా రోజును ఎంతో సంతోషంగా మార్చేసిందని థమన్ వెల్లడించారు.
మరోవైపు నిన్న థియేటర్లలో విడుదలైన వారసుడు సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.గౌతమ్ ssc , అల వైకుంఠపురములో సినిమాలను గుర్తు చేసే విధంగా ఈ సినిమా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.వారసుడు తెలుగులో విజయ్ మార్కెట్ ను కచ్చితంగా పెంచుతుందని దిల్ రాజు భావిస్తున్నారు.
వారసుడు మూవీ తొలిరోజు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy