ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరమే …!  

Kondapur Mandal people Celerates if Baby girl Born, Baby Girl, Kondapur Village - Telugu Baby Girl, Kondapur Mandal People Celerates If Baby Girl Born, Kondapur Village

ప్రస్తుత రోజుల్లో పుట్టబోయేదంటే ఆడపిల్ల అని తెలిస్తే చాలావరకు కడుపులోనే చంపేసే ప్రయత్నాలు అనేకం.ఈ విషయంలో పొరుగు వారు కూడా మళ్లీ ఆడపిల్ల పుట్టిందా అంటూ హేళన చేస్తూ మాట్లాడడంతో కొంతమంది ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Baby Girl Birth Kondapur Mandal

కానీ ఆ ఊర్లో మాత్రం ఆడపిల్ల పుట్టింది అంటే ఊరంతా పండగ చేసుకుంటారు.అందుకే ఆ ఊర్లో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటారు.

ఆ ఊరు ఎక్కడ ఉందని అనుకుంటున్నారా…? ఎక్కడో కాదండో …! మన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని హరిదాసు పూర్.ఈ గ్రామం చూడడానికి చాలా చిన్న గ్రామం అయినా… ప్రపంచం మొత్తానికి ఒక పాఠం తెలియజేసే విధంగా గొప్పదనం ఉంది అక్కడ.

ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరమే …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ రోజులలో ఆడపిల్ల పుడితే పురిట్లోనే చంపేసే మనుషులున్న సమాజంలో… ఆ ఊరిలో వారు మాకు ఆడపిల్ల పుట్టాలి అంటూ దేవుని కోరుకుంటారు.
ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా మహిళలపై జరుగుతున్న స్త్రీలపై అఘాయిత్యాలు ప్రస్తుత రోజుల్లో అనుభవిస్తున్న అవమానాలను చూసి చాలా బాధ పడ్డారు.

దీనితో వారు అందరూ కూర్చొని ఒక మంచి సందేశం ఇవ్వాలనుకున్నారు ప్రపంచానికి.అందుకోసం ఆడపిల్లలను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ఊరంతా చాటింపు వేసి ఎవరికి ఆడబిడ్డ పుట్టిన కూడా ఊరంతా ఒక పండుగలాగా చేసుకోవాలని ప్రకటించారు.

దీనితోపాటు ఊరిలో ఎవరైనా గర్భవతి అయి ఉంటే వారికి ఆడ బిడ్డ పుట్టాలని అందరూ వేడుకోవాలి అని కూడా ప్రకటించారు.
ఆ ఊరిలో ఎవరికైనా అమ్మాయి పుడితే ఆ బిడ్డ పెంపకానికి పంచాయతీ నుంచి కొంత డబ్బు ఇచ్చే లాగా ఊరు గ్రామస్తులు అందరూ కూడా తీర్మానం చేసుకున్నారు.

ఈ ఆలోచనను జనవరి 1, 2020 నుంచి ఆ గ్రామస్తులు అమలు చేసుకుంటూ వస్తున్నారు.

#Baby Girl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Baby Girl Birth Kondapur Mandal Related Telugu News,Photos/Pics,Images..