దారుణం: బ్రతికుండగానే పీక్కుతిన్న హైనాలు, ఎక్కడంటే

ఒక గున్న ఏనుగును బ్రతికుండగానే హైనా లు పీక్కుతిన్న ఘటన ఆఫ్రికా అడవుల్లో చోటుచేసుకుంది.ఆఫ్రికా అనగానే మనకు గుర్తుకు వచ్చేది అక్కడ ఎక్కువగా అడవులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 Baby Elephant Being Eaten Alive By Hyenas-TeluguStop.com

ఇక అడవులలో క్రూర జంతువులు ఉండడం సహజమే అని చెప్పాలి.ఎక్కువగా ఏనుగులు,సింహాలు అలానే తోడేళ్లు, హైనా లు కూడా ఎక్కువగా ఉంటాయి.

అయితే ఆఫ్రికా లో ఎక్కువగా నేల పొడిగా ఉంటుంది,కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం నీరు ఇంకిపోయి బురదగా తయారవుతూ ఉంటుంది.
అయితే అలాంటి బురదలో తల్లి ఏనుగు తో వెళుతున్న ఒక గున్న ఏనుగు దిగబడింది.

దీనితో దానికి బయటకు తీయాలని తల్లి ఏనుగు శతవిధాలా ప్రయత్నం చేస్తుండగానే అక్కడకి సడన్ గా హైనాల గుంపు వచ్చి చేరింది.ఇక అంతే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన తల్లి ఏనుగు గున్న ఏనుగుపై బురద ను కూడా జల్లింది.

కానీ హైనా లు మాత్రం గున్న ఏనుగు ను వదలలేదు.గున్న ఏనుగును గమనించిన హైనా లు తల్లి ఏనుగును అక్కడ నుంచి తరిమేసి దానిపై దాడి కి దిగాయి.

దీనితో బతికుండగానే గున్న ఏనుగును పీక్కు తింటూ అవి అక్కడే ఉన్నాయి.

Telugu Animals, Babyelephant, Baby, Hyenas-

అయితే ఈ మొత్తం తతంగం ఒక వైల్డ్ ఫోటోగ్రాఫర్ కంట పడడం తో తన కెమెరా కు పని చెప్పి ఫోటోలు, వీడియో లు తీశారు.అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.పాపం ప్రాణాలను కాపాడుకోవడానికి తప్పించుకోలేని పరిస్థితి లో ఆ గున్న ఏనుగు హైనా లకు ఆహారమైపోయింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube