చర్మం లేకుండా జన్మించిన బాబు... ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలిస్తే కన్నీరు ఆగదు  

Baby Born Without Skin Receiving Treatment-dr. Ana Duarte,puzzles Doctors,texas Baby,చర్మం లేకుండా జన్మించిన బాబు

ఈ ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక మూలన వింత వింతైన శిషువులు జన్మిస్తూ ఉంటారు. అత్యంత విచిత్రమైన శిషువులు జన్మించడం కొన్ని నిమిషాలు లేదా గంటలు మా అయితే కొన్ని రోజుల వరకు జీవిస్తారు. అయితే ఎలాంటి శిషువు జన్మించిన కన్న ప్రేగు కనుక కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు..

చర్మం లేకుండా జన్మించిన బాబు... ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలిస్తే కన్నీరు ఆగదు-Baby Born Without Skin Receiving Treatment

తాజాగా అమెరికాలో అత్యంత వింతైన బాబు జన్మించాడు. ఆ బాబును బతికించుకునేందుకు తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నం మామూలుగా లేదు. వారి ప్రయత్నంను అభినందించడంతో పాటు, కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేం.

అత్యంత విచిత్రమైన సమస్య ఆ చిన్నారి బాబుకు రావడం నిజంగా శోచనీయం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన శాన్‌ ఆంటోనియాలో ప్రిస్కిల్లా మాల్డోనాడో అనే మహిళ గర్బవతి అయ్యింది. పుట్టబోయే బిడ్డ కోసం ప్రిస్కిల్లా మరియు ఆమె భర్త చాలా కలలు కన్నారు. బాబు పుడితే జబారి అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

పుట్టబోతున్న బిడ్డ కోసం ఎన్నో ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సంతోషంగా ఎదురు చూస్తున్న సమయంలో ఆ సమయం రానే వచ్చింది. ప్రిస్కిల్లా నిండు గర్బిని, ఆమెకు పెయిన్స్‌ రావడంతో టెక్సాస్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో జాయిన్‌ చేయడం జరిగింది.

అక్కడ ఆమెకు పురుడు పోయడం, బాబు జన్మించడం సంతోషకర విషయాలు.

బాబు పుట్టిన కొన్ని నిమిషాల తర్వాత వైధ్యులు ఆ బాబుకు స్కిన్‌ పూర్తిగా లేదు. తల మరియు కాళ్ల వరకు మాత్రమే ఉంది. ఇతర భాగాల్లో చర్మ లేదు.

లోపల గుండె మరియు ఇతర శరీర బాగాలు క్లీయర్‌గా కనిపిస్తున్నాయి. దాంతో ఆ బాబు జన్మించడం కష్టం అన్నారు. కాని ఆ బాబు తల్లిదండ్రులు మాత్రం మరో హాస్పిటల్‌కు తరలించారు..

భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి, కృత్రిమ చర్మం వచ్చేలా చికిత్స చేయిస్తున్నారు. 85 శాతం మాత్రం తాము భరోసా ఇస్తామని వైధ్యులు చెప్పినా కూడా 100 శాతం నమ్మకంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు ఆపుకుని బాబుకు చికిత్స చేయిస్తున్నారు. ఆ తల్లిదండ్రులను చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆ హాస్పిటల్‌లో బాబును చూస్తున్న డాక్టర్లు సైతం అంటున్నారు. ఆరు నెలల పాటు హాస్పిటల్‌లోనే ఉండాల్సి ఉంటుందని సూచించారు.

అప్పటి వరకు బాబు ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత ఏం పర్వాలేదు అని వైధ్యులు అంటున్నారు. అంటే ఆరు నెలల వరకు ఆ తల్లిదండ్రులు రోజులు లెక్క పెడతూ ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో జీవితంచాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రావద్దు కదా.

!