ఆ చిన్నారి గుండె శరీరం బయటకు వచ్చింది... ఆ పాప కోసం తల్లిదండ్రులు పడ్డ కష్టం తెలిస్తే కన్నీరు ఆగవు  

  • పెద్ద వారే చిన్న గాయం అయితే తట్టుకోలేరు, అలాంటిది అప్పుడే పుట్టిన పసి పాపాయికి గుండె ఆపరేషన్‌ అంటే మామూలు విషయం కాదు. యూకేకు చెందిన వానిలోప్‌ విల్కిన్స్‌ అనే చిన్నారికి పుట్టిన కొన్ని వారాల్లోనే గుండె ఆపరేషన్‌ చేశారు. ఆ పాప తల్లి గర్బంలో ఉండగానే గుండె బయటకు వచ్చింది. దాంతో తల్లిదండ్రులు ఆ పాపను కడుపులో ఉండగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. వైధ్యులు ఆ పాప బయటకు వచ్చిన తర్వాత బతికేది అనుమానమే అంటూ చెప్పారు. కాని ఆ తల్లిదండ్రులు మాత్రం అత్యంత జాగ్రత్తగా పాపను కడుపులో పెంచారు, డెలవరీ అయిన తర్వాత కూడా పాప కోసం చాలా కష్టపడ్డారు.

  • పాప జన్మించిన తర్వాత బతికే ఛాన్స్‌ లు 10 శాతమే అన్నారు వైధ్యులు. అయితే తల్లిదండ్రుల బలమైన కోరిక ఆ పాపను బతికించింది. గుండె బయట ఉండి పుట్టిన ఆ పాపకు ఆపరేషన్‌ చేసి వైధ్యులు గుండెను లోపల అమర్చారు. అయితే ఆ పాపకు ఛాతి ఎముకలు లేవు. చాతి ఎముక లేకపోవడంతో గుండె బయటకు వచ్చింది. ఇప్పటికి కూడా ఛాతి ఎముక లేకపోవడం వల్ల గుండె ప్రదేశంలో ఆ పాపకు చిన్న దెబ్బ తలిగినా కూడా అది గుండెకు నేరుగా తలుగుతుంది. దాంతో ఆ పాప ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.

  • Baby Born With Heart Outside Chest Returns Home-Born No Breastbone Vanellope Vanellope Hope Wilkins

    Baby Born With Heart Outside Chest Returns Home

  • తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి ఆ పాపకు ఆపరేషన్‌ చేయించడంతో పాటు ఛాతి ఎముకలు పెరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛాతి ఎముకల వల్ల గుండెకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఛాతి ఎముక పెరిగేందుకు కొన్ని సంవత్సరాలు అయినా పడుతుందని వైధ్యులు చెప్పారు. అప్పటి వరకు ఆ పాపకు ఒక కవచం వంటిది వేశారు. ఆ కవచం ఎప్పటికి అలాగే ఉండాలి. కర్ణుడికి కవచ కుండలాల మాదిరిగా ఆ పాపకు ఛాతి ఎముకలు వచ్చే వరకు ఉండాల్సిందేనట.

  • Baby Born With Heart Outside Chest Returns Home-Born No Breastbone Vanellope Vanellope Hope Wilkins
  • పుట్టినప్పటి నుండి 14 నెలల పాటు హాస్పిటల్‌లోనే ఉంటూ, కేవలం సెలైన్స్‌ మందులతోనే జీవించేసిన ఆ పాప తాజాగా డిశ్చార్జ్‌ అయ్యి తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లింది. ఆ పాప ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, కాకుంటే చిన్న పిల్ల కనుక గుండెకు సమస్య కనుక కంటికి రెప్పలా చూసుకోవాలని వైధ్యులు సూచించారట. ఆ పాపాయి కోసం తల్లిదండ్రులు పడ్డ కష్టంకు అంతా సెల్యూట్‌ చేయాల్సిందే.