వైధ్య చరిత్రలో మరో అద్బుతం, చనిపోయిన 117 రోజులకు బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి

ప్రపంచం మొత్తం టెక్నాలజీలో జెట్‌ స్పీడ్‌తో ముందుకు వెళ్తోంది.వంద ఏళ్ల పరిస్థితికి ఇప్పటికి కొన్ని లక్షల రెట్ల టెక్నాలజీ పెరిగింది.

 Baby Born 117 Days After Stroke Leaves Czech Mother Brain Death-TeluguStop.com

ఆ టెక్నాలజీతో మనిషి చావును ఆపుతున్నారు.చిపోయిన వ్యక్తులను కూడా కొన్ని సార్లు లేపుతున్నారు.

వైధ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ఎన్నో అద్బుతాలు జరుగుతున్నాయి.అప్పుడప్పుడు మనం మీడియాలో వస్తున్న వార్తలను చూస్తూనే ఉన్నాం.

చనిపోయాడుకున్న వ్యక్తి బతికాడు, గుండె మార్పిడి ఇంకా ఎన్నో రకాల మార్పిడి చేస్తున్నారు.బ్రెయిన్‌ మార్పిడి కూడా చేస్తున్నారంటే ఏ స్థాయిలో టెక్నాలజీ పెరిగిందో చెప్పనక్కర్లేదు.

Telugu Brain Give, Brain Jekhia, Jekhia, Telugu Ups, Ups-

  ఇక ఒక గర్బంతో ఉన్న స్త్రీ చనిపోతే ఆమె గర్బంలో ఉన్న పిండం కూడా మృతి చెందాల్సిందే.ఒక వేళ ఆ మహిళ కోమాలోకి వెళ్లినా కూడా ఆ పిండం పరిస్థితి కష్టమే.కాని ప్రస్తుతం వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి ఒక మహిళ కోమాలోకి వెళ్లినా కూడా ఆమె కడుపులో ఉన్న పిండంను ఏకంగా 117 రోజులు బతికించి ఆ తర్వాత డెలవరీ చేయడం జరిగింది.ఇదో వైధ్య శాస్త్ర అద్బుతంగా చెప్పుకోవచ్చు.

కోమాలో ఉన్న సమయంలో ఆ మహిళ కనీసం ఆహారం తీసుకోవడం కుదరదు.అసలు ఆమె బతకడం కూడా అనుమానంగానే ఉంది.

బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ అవ్వడంతో ఆమెను మామూలుగా అయితే మెర్సీ కిల్లింగ్‌ చేస్తారు.కాని ఆమె కడుపులో మరో ప్రాణి ఉన్న కారణంగా ఆమెను కాపాడుతూ వచ్చారు.

Telugu Brain Give, Brain Jekhia, Jekhia, Telugu Ups, Ups-

  బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారు ఇప్పటి వరకు బతికిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతో మంది బ్రెయిన్‌ డెడ్‌ అయితే వారి శరీర భాగాలనే వేరే వారికి ఇచ్చి చనిపోయారు.వారి కుటుంబ సభ్యులు ఇతరులకు వారి అవయవాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.యూరప్‌కు చెందిన 27 ఏళ్ల జెఖియా అనే మహిళ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది.ఆమె బతికే అవకాశం లేదని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు.కాని ఆమెకు పెట్టిన ఆక్సీజన్‌ మాస్క్‌ మాత్రం తొలగించలేదు.

ఆమె కడుపులో ఉన్న పిండంను బతికించుకుంటూ వచ్చారు.

Telugu Brain Give, Brain Jekhia, Jekhia, Telugu Ups, Ups-

  తాజాగా ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది.తాను ఒక ఆడపిల్లకు జన్మనిచ్చాను అనే విషయాన్ని కూడా ఆమె తెలుసుకోలేక పోయింది.అప్పటి వరకు ఆమెకు ఆక్సీజన్‌ ఇస్తూ బతికిస్తూ వచ్చిన డాక్టర్లు సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీసిన తర్వాత ఆమెకు అప్పటి వరకు ఇస్తున్న లైఫ్‌ సపోర్ట్‌ను తొలగించారు.

అంటే ఆమెకు అందిస్తున్న ఆక్సీజన్‌ మరియు ఇతరత్ర వైద్యం నిలిపేశారు.దాంతో ఆమె కొన్ని నిమిషాల్లోనే కన్నుమూసింది.

Telugu Brain Give, Brain Jekhia, Jekhia, Telugu Ups, Ups-

  జెఖియా ఒక మెడికల్‌ వండర్‌గా నిలిచింది.ఆమె చనిపోయినా కూడా ఒక కొత్త తరహా ప్రయోగంకు ఆమె నాంది పలికిందని వైధ్యులు అంటున్నారు.జెఖియా కడుపులో జన్మించిన ఆ వండర్‌ కిడ్‌ ప్రపంచంలోనే అత్యంత అరుదైన అమ్మాయిగా పెరుగనుందని వారు అన్నారు.వైధ్యులు చేసిన కఠోర శ్రమకు ఆ పాప ప్రాణాలతో బయటి ప్రపంచంను చూసింది.

వైధ్య శాస్త్ర అభివృద్దితోనే ఇది సాధ్యం అయ్యింది.ఇంతగా అద్బుతాలను సృష్టిస్తున్న వైధ్య శాస్త్రం ముందు ముందు మరెంతగా అభివృద్ది చెందుతుందో చూడాలి.

Telugu Brain Give, Brain Jekhia, Jekhia, Telugu Ups, Ups-

 

రాబోయే వంద ఏళ్లలో మనిషి చనిపోకుండా కూడా మందులు వస్తాయేమో.ప్రతి ఒక్కరు కూడా వందల ఏళ్లు బతికితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.అదో అద్బుతంగా చెప్పుకోవచ్చు.మరి ఆ అద్బుతాన్ని మనం చూడగలమా లేదో.మనం చూడలేకున్నా మన భవిష్యత్తు తరాల వారికి అయినా ఆ మెడికల్‌ మిరాకిల్‌ అందాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube