రాజీవ్ కనకాల మా నాన్న.. సుమను అవాక్కయ్యేలా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్..?

బుల్లితెర టాప్ యాంకర్ సుమ కనకాల ఏ షోకు యాంకర్ గా వ్యవహరించినా తన యాంకరింగ్ తో ఆ షోను సూపర్ హిట్ చేస్తారనే సంగతి తెలిసిందే.ఈటీవీ ఛానల్ లో ఎక్కువ షోలకు యాంకర్ గా చేసే సుమ చేసే షోలలో క్యాష్ షో కూడా ఒకటి.

 Child Artist Baby Annie About Rajeev Kanakala  In Suma Cash Show , Anchor Suma,-TeluguStop.com

ఈ శనివారం ప్రసారం కాబోయే క్యాష్ షో ప్రోమోలో చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్న యానీ, నిఖిల్ , ప్రణవి, సాత్విక్ వచ్చారు.గతంలో చిన్నపిల్లలుగా క్యాష్ షోకు వచ్చిన వీళ్లు పెరిగి పెద్దయ్యారు.

విక్రమార్కుడు, రాజన్న సినిమాలలో నటించి గుర్తింపును సంపాదించుకున్న యానీ సుమపై పంచ్ లు వేస్తూ ప్రేక్షకులకు ఎంట్ర్టైన్మెంట్ అందించారు.సుమ యానీతో నా కళ్ల ముందే పెరిగి పెద్దవాళ్లైన నిన్ను చూస్తున్నా అని చెప్పగా యానీ మేం ఇలా పెద్దగా అవుతున్నాం నువ్వు మాత్రం అదే అందం అదే వయస్సు అంటూ వయస్సొద్దులే అని పంచ్ వేస్తారు.

సాత్విక్ అనే ఆర్టిస్ట్ మాట ఇప్పటికీ తడబడట్లేదు అక్కది అని చెప్పగా సుమ అంటే నాకు తడబడిపోయి పళ్లు కూడా రాలిపోయి జుట్టు ఊడిపోయి ఉంటాననుకున్నావా అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఆ తరువాత సుమ క్యాష్ లో ఫస్ట్ రౌండ్ ఏంటో చెప్పండి అని అడగగా యానీ “పైసా వసూల్” అని చెబుతుంది.సుమ వెంటనే ఒసేయ్ దుర్మార్గురాలా.! వచ్చే దారిలో ఒక ఎపిసోడ్ చూసుకుని వచ్చావ్ కదా.! అని అంటారు.ఆ తరువాత యానీ రాజీవ్ కనకాలను అంకుల్ అని పిలవగా అందరూ అంకులా అంటారు.

ఆ తరువాత అన్న, బావ అని చెబుతూ చివరకు రాజీవ్ కనకాల నాకు తండ్రి అవుతాడని చెబుతుంది.

యానీ మాటలతో సుమ ఒక్కసారిగా అవాక్కవుతారు.

ఒక సినిమాలో రాజీవ్ కనకాల తనకు తండ్రిగా నటించారని అందుకే నాన్న అవుతారని యానీ అన్నారు.ఈ ప్రోమోకు 23 లక్షల వ్యూస్ రాగా మార్చి 13వ తేదీన రాత్రి 9 : 30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube