హౌస్ నుండి బయటకొచ్చిన బాబు గోగినేని సంచలన కామెంట్స్.! తేజస్వి గెలుస్తుందనుకున్నా, కానీ కౌశల్.?  

అందరూ అనుకున్నదే జరిగింది.. బిగ్‌బాస్‌ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు కౌశల్‌ ఆర్మీ ఉండనే ఉంది. అసలే కౌశల్‌కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.. కౌశల్‌ ఫాలోవర్స్‌కు బాబుపై వ్యతిరేకత చూపించారు.

Babu Gogineni Comments On Kaushal And Tejaswi-

Babu Gogineni Comments On Kaushal And Tejaswi

హౌస్ నుంచి బయటకు వచ్చాక బాబు గోగినేని హౌస్ లో తన అనుభవాలని ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు. బయట ప్రపంచం గురించి తెలియకుండా హౌస్ లో ఇన్నిరోజుల పాటు కొనసాగానని, ఇది తన జీవితంలో మంచి అనుభవం అని బాబు గోగినేని అన్నారు.

Babu Gogineni Comments On Kaushal And Tejaswi-

తనకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు కొందరు తాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మాట్లాడారు. తాను ఎలిమినేట్ అయిన అయిన సందర్భంలో వారంతా బాధపడ్డారని, ఏడ్చారని కూడా బాబు తెలిపారు. బాబు గారు లేకపోవడంతో వారు షో చూడడం కూడా మానేశారు అంట.

Babu Gogineni Comments On Kaushal And Tejaswi-

హౌస్ లో కొన్నిరోజులు గడిచాక తేజస్వి గెలుస్తుందని భావించానని బాబు తెలిపారు. కానీ ఆమె చాలా త్వరగా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడో వేడినీళ్లు ఇస్తారు. అప్పుడప్పుడు అన్నం పెడుతారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పరిస్థితులు గమనిస్తే కౌశల్ తప్పనిసరిగా ఫైనల్ కు చేరుకుంటారని బాబు అంచనా వేశారు. బయట ఆడియన్స్ నుంచి అతడికి సపోర్ట్ లభిస్తోంది. ఓటింగ్ ట్రెండ్స్ కూడా అలాగే ఉన్నాయి.