పవన్ వద్దు.. వైసీపీ అభ్యర్థులే ముద్దు ! ఇదేంటి బాబు ?

అధికారం అనే దర్పం అంత తేలిగ్గా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.పదవిలో ఉన్న మజా అదేమరి.

 Babu Says Ycp Favourite Not Pawan-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అలాగే అధికారానికి దూరం అయ్యేందుకు ఏ మాత్రం ఇష్టపడడంలేదు సరికదా, మీకు ఫలానా అధికారం లేదు అని ఆ చీఫ్ సెక్రటరీ ఆంక్షలు పెట్టడం కూడా బాబు కి మంట తెప్పిస్తోంది.అయితే బాబు చేయించుకున్న సొంత సర్వేల్లో మాత్రం టీడీపీకి అంత సీన్ లేదని, అధికారం వైసీపీకే దక్కబోతోంది అంటూ అందులో తేలినా బాబు మాత్రం ఏదో ఒకరకంగా మళ్ళీ అధికారం దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు.

అందుకే అందివచ్చిన ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.

మొన్నటి వరకు ఏపీలో హంగ్ వస్తుంది అన్న ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చేరదీసినట్టు కనిపించాడు.

పార్టీ శ్రేణులకు కూడా పవన్ మనవాడే అంటే అతని మీద ఎటువంటి విమర్శలు చేయవద్దు అంటూ పార్టీ నాయకులకు చెప్పుకొచ్చాడు.అందుకే టీడీపీ నేతలు, కార్యకర్తలు పవన్ మీద పెద్దగా విమర్శలు చేయలేదు.

కాకపోతే ఇప్పుడు పవన్ వల్ల టీడీపీకి వరిగేది ఏమీ లేదనే నిర్ణయానికి వచ్చాడు.టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే జనసేనకు కూడా ఎన్నో కొన్ని స్థానాలు వస్తాయని, ఒకవేళ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మెజార్టీ సరిపోకపోతే అప్పుడు పవన్ ను మళ్లీ తమలో కలిపేసుకోవచ్చనే ప్లాన్ లో బాబు ఉన్నాడు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తే జనసేనకు 2 ,3 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని బాబుకు బాగా అర్థమైపోయింది.అందుకే పవన్ ను పక్కనపెట్టేసి ఇంకో ప్లాన్ అమలు చేసే పనిలో పడ్డాడు.

ఒకవేళ మెజారిటీకి ఓ పది సీట్ల లోపు గనుక తక్కువయితే వైసీపీ ఎమ్యెల్యేల మద్దతు తీసుకోవాలని బాబు ఆలోచన చేస్తున్నాడు.అందుకే ఇప్పటి నుంచే కొంతమంది గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను గుర్తించి తమ దారికి తీసుకొచ్చేందుకు రాయబారాలు నడుపుతున్నాడు.

కానీ వైసీపీ కి స్పష్టమైన మెజార్టీ వస్తే బాబు ఎత్తులు పనిచేయవు.అయినా ఏదో చిన్న ఆశతో కొంతమంది వైసీపీ ఎమ్యెల్యేలకు గేలం వేసే పనిలో పడ్డాడు బాబు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube