ఒకప్పటి ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “ఘరానా మొగుడు” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన “సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

 Do You Konw This Veteran Actress Vani Viswanath, Tollywood Veteran Heroine, Babu-TeluguStop.com

అయితే వాణి విశ్వనాథ్ తెలుగులో నటించినటువంటి చిన్న కోడలు, ఘరానా మొగుడు, లేడీస్ స్పెషల్, సీతాపతి చలో తిరుపతి, రైతు భారతం, జయ జానకి నాయక తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే పలు మలయాళ సినిమాల్లో నటించే సమయంలో కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన “హీరో బాబు రాజ్” ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

  ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే పెళ్లయిన తర్వాత అడపాదడపా సినిమాల్లో వాణి విశ్వనాథ్ కనిపించినప్పటికీ పెద్దగా రాణించలేక పోయింది.దీంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరింది.దీంతో అప్పట్లో వాణి విశ్వనాథ్ గత ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు కూడా పలు వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వాణి విశ్వనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా తెలుగులో చివరగా వాణి విశ్వనాథ్ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన జయ జానకి నాయక అనే చిత్రంలో జగపతి బాబు చెల్లెలి పాత్రలో నటించింది.

ఈ చిత్రంతో వాణి విశ్వనాథ్ తన సెకండ్ ఇన్నింగ్స్ తెలుగులో ప్రారంభించినప్పటికీ ఆ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.దీంతో అప్పటి నుంచి మళ్లీ వాణి విశ్వనాథ్ ఇప్పటివరకు తెలుగులో నటించలేదు.

కాగా వాణి విశ్వనాథ్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 120 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube