కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు.. అంత అవసరమా: బాబు మోహన్

Babu Mohan Sensational Comments On Present High Budget Movies

ప్రముఖ నటుడు, కమెడియన్ గా చిత్ర పరిశ్రమలో మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి బాబు మోహన్.తన నటనతో, కామెడీతో ప్రేక్షకులను అలరించిన గొప్ప హాస్య నటుడు.

 Babu Mohan Sensational Comments On Present High Budget Movies-TeluguStop.com

ఎంతో మంది అగ్ర హీరోలతో కలిసి నటించి అప్పట్లోనే గొప్ప హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు.ఎన్నో వందల సినిమాల్లో నటించి గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాబుమోహన్ ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఇక పోతే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న స్టార్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న బాబు మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో కనిపించడం లేదు.ఆ విషయం అందరికి తెలిసిందే.

 Babu Mohan Sensational Comments On Present High Budget Movies-కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు.. అంత అవసరమా: బాబు మోహన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవకాశాలు వచ్చినా కూడా చిన్న పాత్రల్లో చేయడం తనకు ఇష్టం లేకపోవడం వల్లనే ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించడం లేదని ఆయన అన్నారు.

ఇక ప్రస్తుత కాలంలో తెరకెక్కే ఈ సినిమాలో నుంచి బాబు మోహన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.కోట్లు ఖర్చు పెడితే సినిమా అంటారా ? చక్కగా పోదుపుతో తీసినా అది కూడా మంచి సినిమానే అని బాబు మోహన్ అన్నారు.పొదుపుగా ఉన్న కుటుంబాలు అన్ని రంగాల్లోనూ బాగుంటాయని, అనవసరమైన పోకడలకు పోయేవి పేక మేడలా పడిపోతుంటాయని ఆయన తెలిపారు.

ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని వేల ఎకరాలు ఉన్నా ఆఖరికి మనువడి దగ్గరికి వచ్చే సరికి అడుక్కు తినే పరిస్థితి వచ్చే వాళ్ళను, చాలా మంది దొరలను కూడా చూస్తూ ఉంటామని ఆయన స్పష్టం చేశారు.కాబట్టి ఎవరిష్టం వాళ్ళది.

డబ్బులు వాళ్ళవి.కష్టపడి వచ్చిన డబ్బు ఐతే దాని విలువ తెలుస్తుంది.

తాతలు, తండ్రులు సంపాదించిన డబ్బు , లేకపోతే ఉత్త పుణ్యానికి లేదా ఏదన్నా కాంట్రాక్ట్ చేస్తే వచ్చిన డబ్బు ఐతే దాని విలువ తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.ఎవరైతే కష్టపడి సంపాదించిన డబ్బుతో సినిమా తీస్తారో వాళ్ళకే ఆ విలువ తెలుస్తుందని బాబు మోహన్ అన్నారు.

#Babu Mohan #Budget

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube