మా ఎలక్షన్లపై బాబు మోహన్ సంచలనం.. వాళ్లు చీడపురుగులంటూ?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల 12వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ ఏడాది మా ఎన్నికలు రసవత్తరంగా మారడంతో పాటు ఎన్నికలు జరిగే సమయానికి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

 Babu Mohan Sensational Comments About Movie Artist Assosiation Elections-TeluguStop.com

తాజాగా బాబు మోహన్ మా ఎన్నికల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడానికి చాలా సమయం ఉందని ఎన్నికలు జరిగే సమయంలో మాత్రమే వాటి గురించి మాట్లాడతామని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

 Babu Mohan Sensational Comments About Movie Artist Assosiation Elections-మా ఎలక్షన్లపై బాబు మోహన్ సంచలనం.. వాళ్లు చీడపురుగులంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగవని కొందరి వల్ల జరపాల్సి వస్తోందని బాబు మోహన్ వెల్లడించారు.అన్ని రంగాలలో చెడగొట్టే చీడపురుగులు ఉంటాయని నటనా రంగంలో కూడా ఆ చీడ పురుగులు ఉన్నాయని బాబు మోహన్ తెలిపారు.

చాలా రోజుల తరువాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని ఈ ఎన్నికలలో ఓటు తమ తోబుట్టిన వారికి వేశామని అనుకుంటామని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.మూవీ ఆర్టిస్ట్ సభ్యులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లను మేము వేర్వేరు కాదని బాబు మోహన్ పేర్కొన్నారు.ఫ్యామిలీ మీటింగ్ గా ఉండే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను కొంతమంది ఎలక్షన్ లా మార్చారని తెలిపారు.

Telugu About Elections, Babu Mohan Comments, Chiranjeevi, Dasari Naraya Rao, Jeevitha, Maa Elections, Manchu Vishnu, Prakash Raj, Tollywood-Movie

చిరంజీవి, దాసరి గతంలో ఇలాంటివి జరగకుండా చూశారని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.చిరంజీవి ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నారో లేదో తెలియదని జరిగేది ఒకటి అయితే వార్త ప్రచారంలోకి వచ్చేది మరొకటని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.బాబు మోహన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఇప్పటికి కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

#About Elections #Prakash Raj #Manchu Vishnu #Jeevitha #MAA Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు