చిరంజీవి అంటే హీరోయిన్స్ కు వణుకు.. టాలీవుడ్ లో మగాడంటే చిరంజీవినే: బాబు మోహన్

చిరంజీవి ఒక మగాడు అంటూ ఆయన కీర్తిని గడించారు నటుడు బాబు మోహన్.ఇక ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

 Babu Mohan Great Words About Megastar Chiranjeevi, Megastar Chiranjeevi, Babu Mo-TeluguStop.com

ఇక వివరాల్లోకి వెళితే, అప్పుడు, ఎప్పుడూ ఎవర్ గ్రీన్ నటుడిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు మెగా స్టార్ చిరంజీవి.చాలా మంది ఆయన నటనకు ఫ్యాన్స్ అయితే, ఎంతో మందికి ఆయన డాన్స్ ను ఆదర్శంగా తీసుకుంటారు.

అప్పటి హీరోలలో ఆయన వేసిన స్టెప్పులు మరే హీరో కూడా వేయలేరు అనే పేరును కూడా మూటగట్టుకున్నారు చిరంజీవి.అప్పటి హీరోయిన్లతో పాటు, వర్ధమాన నటీ మనులతోనూ పోటీ గా నటిస్తూ, వారికంటే అందంగా డాన్స్ లు చేస్తూ ఇప్పటికీ కుర్రకారును ఉర్రూతలగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ప్రముఖ నటుడు, కమెడియన్ బాబు మోహన్ కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.ఆయన డాన్స్ చేస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయే వాడినని, ఒక స్ప్రింగ్ లాగా ఆయన వంకలు తిరుగుతూ డాన్స్ చేయడం నిజంగా అద్భుతం అని బాబు మోహన్ తెలిపారు.

Telugu Babu Mohan, Babumohan, Chiranjeevi, Tollywood-Movie

అంతే కాకుండా ఆయన డ్యాన్స్ చేస్తుంటే, కళ్లు ఆకాశమంత చేసుకొని అలా చూస్తానని ఆయన తెలిపారు.అప్పటి హీరోయిన్లు రాధ, భానుప్రియ, విజయ శాంతి లాంటి వాళ్లతో పోటీగా చిరంజీవి నటనే కాకుండా డ్యాన్స్‌లోనూ అత్యంత ప్రతిభను కనబరుస్తారని ఆయన అన్నారు.చిరన్న డ్యాన్స్‌లకు తానెప్పుడూ అభిమానినే అంటూ ఆయన గర్వంగా చెప్పారు.ఆయనలాగా లేడీస్‌ కూడా చేయలేదని, వాళ్లు కూడా కొన్నిసార్లు నిలబడే చేశారని బాబు మోహన్ చెప్పారు.

ఆయన బాడీ ఒక స్ప్రింగ్‌లాగా కదులుతుందని ఆయన తెలిపారు.ఇప్పుడున్న వాళ్లు చేయరని కాదు, అందరూ బాగా చేస్తారని, ఇప్పుడున్న వాళ్లు కూడా చాలా బాగా డ్యాన్స్‌లు చేస్తున్నారని బాబు మోహన్ అన్నారు.

కానీ చిరంజీవి డ్యాన్స్ చేస్తుంటే మాత్రం ఒక మగాడు చేస్తున్నాడ్రా డ్యాన్స్ .అని తనకు అనిపిస్తుంటుందని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube