ఏడ్చిన బాబూమోహన్ ! కారణం కేసీఆర్  

“ఉరిశిక్ష వేసే ఖైదీలకు ఆఖరి కోరిక అడుగుతారు. కానీ 25సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికాను. ఎమ్మెల్యే గా ఉన్న నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ స్పందించలేదు. ఈరోజు వరకు నాకు టీఆర్ఎస్ నాయకులు కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు అంటూ బాబూ మోహన్ కంటతడిపెట్టారు.

Babu Mohan Crying Reason Kcr-

Babu Mohan Crying Reason Kcr

సంగారెడ్డి బీజేపీ ఆఫీస్ లో బాబుమోహన్ ప్రెస్ మీట్ పెట్టారు. “కేసీఆర్ ని నేను గాడ్ ఫాదర్ గా భావిస్తాను.. కానీ ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు. స్థానికుడి పేరుతో మరో వ్యక్తికి టికెట్ కేటాయించారు. 25 సంవత్సరాలుగా ఆందోల్ నుంచే పోటీ చేసిన నేను.. ఎలా స్థానికుడిని కాకుండా పోయాను. సముద్రంలో ఉన్న నన్ను ఒక్క సారిగా నడి రోడ్డుపై పడేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.