రెడీగా ఉండండి తమ్ముళ్లూ ! తెలంగాణాలో ప్రచారానికి బాబు     2018-10-23   16:49:48  IST  Sai Mallula

తెలంగాణాలో ఓటింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి. గ్రామస్థాయిలో ఇప్పటికే ప్రచార వాహనాలు దూసుకెల్తూ మైకులతో హోరెత్తిస్తున్నాయి. ఇక మహాకూటమి తరపున తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ కూడా ప్రచారం మొదలుపెట్టేసింది. ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా రెడీ అవుతున్నాడు. ఈ మేరకు పార్టీ నాయకులకు వర్తమానం పంపడంతో…. టీటీడీపీ నాయకుల్లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.

Babu Is Ready To Campaign In Telangana-

Babu Is Ready To Campaign In Telangana

సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రకటనపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రచారంతో మహాకూటమి విజయావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.