బాబు ఆగ్రహం జగన్ పైనా  ప్రధాని పైనా ?

మొత్తం మీద టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కరోనా పై యుద్ధం ప్రకటించారు.అయితే అది నేరుగా మాత్రం కాదు.

 Babu Is Angry With The Prime Minister Over Jagan-TeluguStop.com

రాజకీయంగా.దేశవ్యాప్తంగా కరోనా  తీవ్రత పెరుగుతున్నా, సరైన చర్యలు తీసుకోవడం లేదని,  ప్రస్తుత పరిస్థితులు,  జాగ్రత్తల విషయమై చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.

  ఈ సందర్భంగా అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసినవా లేక  ప్రధాని నరేంద్ర మోదీ పై చేసిన విమర్శలా అనే విషయంలో గందరగోళం ఏర్పడింది.

 Babu Is Angry With The Prime Minister Over Jagan-బాబు ఆగ్రహం జగన్ పైనా  ప్రధాని పైనా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టొద్దని చంద్రబాబు విమర్శించడాన్ని అటు బిజెపి,  ఇటు వైసిపి రాజకీయం చేస్తున్నాయి.జాతిని తాకట్టు పెట్టొద్దు అనే మాట భారతదేశం మొత్తానికి ఆపాదించే లా చంద్రబాబు మాట్లాడారని , కరోనా ను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని , అందుకే అంతర్జాతీయ మీడియా సైతం  తప్పు బట్టిన విషయాన్ని చంద్రబాబు హైలెట్ చేస్తున్నారు.

 ఇదంతా మోదీని చంద్రబాబు ఇరుకున పెడుతున్నట్లు ఉందనే ప్రచారం పై బీజేపీ మండిపడుతోంది.ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు హైలెట్ చేస్తూ ఉండగా,  టీడీపీలో మరో వర్గం మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలు ఎవరికి బాగా తగలాలో వారికి తగిలాయని చెబుతున్నారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టవద్దనే వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ను ఉద్దేశించి అన్నట్లుగానే టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Telugu Ap Cm, Bjp, Cbn, Jagan, Janasena, Lokesh, Modhi, Pavan, Prime Minister, Tdp, Ysrcp-Telugu Political News

 అదే ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేయాల్సి వస్తే,  నేరుగా ఆయన పేరు పెట్టి విమర్శలు చేసి ఉండేవారని , గత కొంతకాలంగా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న , ఆ పార్టీ పెద్దలు ఎవరు పట్టించుకోకపోవడంతోనే , ఈ విధంగా విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంలో మాత్రం చంద్రబాబు కన్ఫ్యూజ్ చేసినట్లుగానే కనిపిస్తున్నారు.అయితే పదో తరగతి పరీక్షల విషయంలో జగన్ అవలంభిస్తున్న వైఖరిని చంద్రబాబు తప్పుబట్టారు.

#AP Cm #Modhi #Prime Minister #Janasena #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు