టీవీలో మనకి చూపించని 10 సంఘటనలు ఇవే.! బిగ్ బాస్ హౌస్ మరో కోణాన్ని బయటపెట్టిన బాబు గోగినేని.!  

Babu Gogineni Ravelas Unseen Facts About Bigg Boss 2 Telugu-

బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ ముగిసింది. ఎన్నో అటంకాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొని విజేతగా కౌశల్ నిలిచారు. బిగ్‌బాస్‌లో ఉండగా బయట నుంచి కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దాంతో ఆయన సులభంగా పలు ఎలిమినేషన్ల గురించి బయటపడ్డారు...

టీవీలో మనకి చూపించని 10 సంఘటనలు ఇవే.! బిగ్ బాస్ హౌస్ మరో కోణాన్ని బయటపెట్టిన బాబు గోగినేని.!-Babu Gogineni Ravelas Unseen Facts About Bigg Boss 2 Telugu

అయితే గతంలో కౌశల్ ఆర్మీ పై బాబు గోగినేని గారు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కౌశల్ ఆర్మీ పెయిడ్ అని అన్నారు.ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఆ విషయమై బాబుపై కౌంటర్ పేల్చేశారు.

తాజాగా కౌశల్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆయనపై వెటకారంగా కామెంట్స్ చేసారు.

ఇది ఇలా ఉండగా…ఓ ఇంటర్వ్యూలో బాబు గోగినేని గారు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పది సంఘటనలగురించి షేర్ చేసుకున్నారు. ఆ సందర్భాలని టీవీలో టెలికాస్ట్ చేయలేదు అని కూడా ఆయన చెప్పారు. ఆ ఇన్సిడెంట్స్ ఏంటో ఓ సారి లుక్ వేసుకుందాము.

1. నామినేషన్ లిస్టులో ఉండకూడదని దీక్ష చేసి, ఉపవాసాలున్న ఇద్దరు ఆడవారు ఉన్నారు ఆ ఇంటిలో. కానీ పాపం వారిద్దరూ బయటకు వచ్చేశారు. ఎవరో మరి ఆ ఇద్దరు.

?

2. ఇంటి సభ్యుల్లో నలుగురు ఆడవారు తమ కులాలు ఏమిటో చెప్పి మరీ ఒక జట్టుగా వ్యవహరించడంపై ఆయన విమర్శించారు.

3. ఇంట్లో ప్రతి మూల వేలాడుతున్న ప్లాస్టిక్ పిరమిడ్లు, అర్థం కాని భాషలో షో నిర్వాహకులు ENDOMOLSHINE మంచి జరగాలని సీలింగ్ మీద ఇంగ్లిష్ లిపిలో అతికించిన విదేశీ మంత్రాలు. ఇలా హౌస్ మొత్తం మూఢనమ్మకాలతో నిండిపోయింది. దీనిపై వ్యతిరేకంగా నేను మాట్లాడింది షోలో టెలికాస్ట్ చేయలేదు.

4. ఆ రోజు ఖగోళశాస్త్రం సంగతేమిటో కాని, తనీష్ మాత్రం నందినికి కన్ను కొట్టడం ఆపలేదు! చాలా నవ్వుకున్నాం...

5. ముట్టుకోకుండా ఒకరి చేతిలోని లోలకం (pendulum) ఎలా వేగంగా కదిలేటట్లు చేయవచ్చో గణేష్‌తో చేసి చూపించాను.

6. దీప్తి సునయనను హిప్నోటైజ్ చేసాను. అప్పుడే మైండ్ గేమ్స్ ఆడకూడదు అని బిగ్ బాస్ ఆర్డర్ పాస్ చేసారు...

7. ఆ ఇంటిలో నాకు అందరికన్నా నచ్చిన తేజస్వి. “నువ్వు నా తండ్రివై ఉంటే ఎంత బాగుండేది” అన్న తనకు. “ఈ రోజు మా బాబు అరుణ్‌కు అక్క దొరికింది, తేజూ!” అని చెప్పాను.

8. “అదేమోగానీ, నన్ను మాత్రం మీరు ‘అక్క’ అనే పిలవాలి, బాబు బ్రో!” అని ఆప్యాయంగా అడిగింది చిన్నపిల్ల దీప్తి సునైనా..

9. బయట ఏమి జరుగుతోందో వారు దురుద్దేశపూర్వకంగా కొంత మందితో చెప్పడం నేను విన్నాను. అసలు గేమ్ ఉద్దేశమే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆడాలని కదా? ఇది భరించలేక ఎలిమినేట్ అయ్యి వచ్చేసాను.

10. కౌశల్ ఆర్మీ బయట ఎలా ఉందో అతను తెలుసుకోవాలి. కౌశల్ ఆర్మీ క్రియేట్ అవడంలో అతని పాత్ర ఉంది. ఈ ఆర్మీ అతని పాపులారిటీ నుంచి పుట్టింది కాదు.

గ్‌బాస్ అనేది జస్ట్ గేమ్ మాత్రమే. జీవితం అనేది బిగ్గర్ బాస్. ఇలాంటి సిల్లీ ఆర్మీస్‌‌ని తప్పనిసరిగా నిషేధించాలి.