నానిని వదిలేది లేదంటున్న బాబు గోగినేని.. ఇంకా ఎంత కాలం బాబు గొడవ?  

  • తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు నాని హోస్ట్‌గా వ్యవహరించగా, కౌశల్‌ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. వీరిద్దరిపై కూడా బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్‌ అయిన బాబు గోగినేని తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. బిగ్‌బాస్‌ గేమ్‌లో ఉన్నప్పుడే ఒక సమయంలో బాబు గోగినేని హోస్ట్‌గా వ్యవహరించిన నానిపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆ విషయం కాస్త సీరియస్‌ అవ్వడం, ఇంటి సభ్యులు కూల్‌ చేయడం జరిగింది. ఆ వెంటనే బాబు గోగినేని ఇంటి నుండి బయటకు వచ్చేశాడు.

  • బాబు గోగినేని బయటకు వచ్చేసిన తర్వాత కూడా కౌశల్‌ ఆర్మీపై నానిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. కౌశల్‌ ఆర్మీకి భయపడి నాని షోను సరిగా చేయలేక పోతున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కౌశల్‌ ఆర్మీ నడిపించినట్లుగా నాని నడుస్తున్నాడు, కౌశల్‌ ఫేక్‌ ఓట్లను పొందుతున్నా కూడా షో నిర్వహకులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు అంటూ బాబు గోగినేని పలు వేదికలపై ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. కౌశల్‌ ఫేక్‌ ఓట్ల గురించి నానికి ముందే తెలిసినా కూడా ఆయన మాత్రం బయట పడలేదు అంటూ బాబు గోగినేని ఆరోపణలు చేస్తున్నాడు. మొత్తానికి అన్ని విధాలుగా నానిపై బాబు గోగినేని ఆరోపణలు చేయడం జరిగింది.

  • Babu Gogineni Demands Nani To Respond On Bigg Boss Voting Pattern-Bigg Telugu 2 Bigg Pattern Hero Kaushal Army

    Babu Gogineni Demands Nani To Respond On Bigg Boss Voting Pattern

  • తాజాగా కౌశల్‌ ఆర్మీలో విభేదాలు మరియు కౌశల్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో బాబు గోగినేని మరోసారి మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం యూకేలో ఉన్న బాబు గోగినేని పలు విషయాలపై మాట్లాడుతూ కౌశల్‌ ఆర్మీ ఫేక్‌ అని తేలిన నేపథ్యంలో నాని ఇప్పటికి అయినా స్పందించాలని, లేదంటే ఆయన చరిత్ర హీనుడిగా మిగిలి పోతాడు అంటూ బాబు గోగినేని అంటున్నాడు. నాని స్పందించే వరకు తాను ఆయనపై విమర్శలు మానను అన్నాడు. కౌశల్‌ విజయం పట్ల నాని తన మనసులో మాట చెప్పాలని బాబు గోగినేని డిమాండ్‌ చేస్తున్నాడు. సీజన్‌ 2 పూర్తి అయ్యి సంవత్సరం పూర్తి అయినా ఇంకా ఎందుకు ఈ లొల్లి అంటూ జనాలు చిరాకు పడుతున్నారు. కాని బాబు మాత్రం వదిలేలా లేడు.