ఆర్జీవీ, మంచు విష్ణు, కమెడియన్ పృథ్విను ఏకిపారేసిన బాబు గోగినేని..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టికెట్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.సినిమా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం పూర్తిగా తగ్గించడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

 Babu Gogineni Comments On Rgv Manchu Vishnu And Comedian Prithvi Details,  Babu-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ వ్యవహారం పై స్పందిస్తూ ఏపీ మంత్రులతో వరుసగా విభేదాలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే కొడాలి నాని, పేర్ని నాని, రామ్ గోపాల్ వర్మ మధ్య పెద్దఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది.

ఇలా వీరిద్దరూ ఒకరి పై ఒకరు పరస్పర మాటల దాడి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలోకి సామాజికవేత్త, హేతువాది, మానవవాది కలగలిపితే బాబు గోగినేని. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాబు గోగినేని ఏ విషయంపై అయినా స్పందిస్తే అతని విధానం ఎంతో భిన్నంగా ఉంటుంది.ఏ విషయం గురించి అయినా ఈయన చేసే పరోక్ష వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తాయి.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబు గోగినేని గుర్తింపుతో పాటు నెగిటివిటీ కూడా మూట కట్టుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా ఈయన సినిమా టికెట్ల వ్యవహారం పై చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారో అర్థం కాక ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా ఊహించుకుంటున్నారు

ఈ క్రమంలో సినిమా టికెట్ల వ్యవహారం పై రామ్ గోపాల్ వర్మ నుంచి మంచు విష్ణు, 30 ఇయర్స్ పృథ్వి వరకు ఇండైరెక్టుగా వారిని టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో ఏకిపారేశారు.ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ… ఎలక్షన్లలో స్పాన్సర్డ్ మిమిక్రీ సినిమాలను తీసే వాళ్ళు ఆ మిమిక్రీ సినిమాల్లో సంబరంగా నటించే జర్నలిస్టులు, పదవులను ఆశించి ప్రచారం చేసిన హీరోలు సీఎం నా బావ అంటూ చెప్పుకునే వారు, లెజెండరీ పెదరాయుడును, వెనక నుంచి పట్టుకొచ్చిన కమెడియన్స్ వీళ్ళకంటే ఎన్నికలలో ఫైనాన్స్ చేసి చివరికి వారి రొమ్ములపై గుద్దిచ్చుకున్న ప్రొడ్యూసర్ వీరందరిని వాడుకునే ఒక మంచి కామెడీ సినిమా తీయొచ్చు అని ఈయన ఈ విషయంపై బహిరంగంగా పోస్ట్ చేశారు.ఇలాంటి సినిమా విడుదల చేస్తే ఎంచక్కా వోడ్కా తాగుతూ సినిమా చూస్తారు అని ఎద్దేవా చేశారు.

బాబు గోగినేని ఈ విధంగా పోస్ట్ చేయడంతో ఈ విషయం పై చాలామంది స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా స్పందిస్తూ స్పాన్సర్డ్ మిమిక్రీ సినిమాలు అంటే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని, ఇక జర్నలిస్టులు అంటే కత్తి మహేష్, స్వప్న, పహాకం, మా అధ్యక్షుడు మంచు విష్ణు లెజెండ్రీ నటుడు మోహన్ బాబు, పదవుల్ని ఆశించి ప్రచారం చేసిన కమెడియన్ పృథ్విరాజ్, అలీ అంటూ బాబు గోగినేని పోస్ట్ పై ఎంతో మంది స్పందిస్తూ ఈ విధమైనటువంటి కామెంట్ చేస్తున్నారు.కేవలం ఐదు నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే ఈ సమస్య కోసం పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ మధ్య ఇలాంటి వివాదాలు చెలరేగుతున్నాయి.

మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube