కౌశల్‌ ఆర్మీ బూటకం.. త్వరలో నిజాలు నిగ్గు తేల్చుతాడట..  

Babu Gogineni Comment On Kaushal Army Bigg Boss Telugu 2-

హేతువాది బాబు గోగినేని అందరిని ఆశ్చర్యపర్చుతూ బిగ్‌బాస్‌ ఇంట్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌లో బిగ్గర్‌ బాస్‌ అంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబు గోగినేని ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా కౌశల్‌తో విభేదాలు పెట్టుకుంటూనే వచ్చాడు.ఎక్కువ వారాలు బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగుతూ వచ్చిన బాబు గోగినేని ఇటీవలే ఎలిమినేట్‌ అయ్యాడు..

Babu Gogineni Comment On Kaushal Army Bigg Boss Telugu 2--Babu Gogineni Comment On Kaushal Army Bigg Boss Telugu 2-

ఎలిమినేట్‌ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ కనిపిస్తున్నారు.తాజాగా బాబు గోగినేని కూడా బిగ్‌బాస్‌ షో గురించి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

బాబు గోగినేని మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్‌ ఏం చేసినా కూడా అది బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకే ఉంటుంది.ఎలా మసులుకున్నా కూడా అది బిగ్‌ బాస్‌ ప్లానింగ్‌ అయ్యి ఉంటుందని బాబు గోగినేని అన్నాడు.

ఇక కౌశల్‌తో విభేదాల గురించి, కౌశల్‌ ఆర్మీ గురించి కూడా బాబు గోగినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బాబు గోగినేని చాలా ఆగ్రహంతో కౌశల్‌ ఆర్మీపై విమర్శలు చేశాడు.వ్యక్తికి ఆర్మీ అంటూ ఏర్పాటు అవ్వడం ఇది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చాడు..

బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ ప్రారంభం అయిన రెండు వారాల్లోనే కౌశల్‌ ఆర్మీ ఇంత భారీగా నిర్మాణం అవ్వడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు.ముందు నుండే పక్కా ప్రణాళికతో ఈ ఆర్మీని నిర్మించి ఉంటారు.ఇక ఈ ఆర్మీని ఎవరో కావాలని నడుపుతున్నారు.

ఈ విషయమై కాస్త లోతుగా అద్యయనం చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి.కౌశల్‌ ఆర్మీ అనేది బయట, సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత పవర్‌ ఫుల్‌ ఏమీ కాదు అంటూ బాబు గోగినేని అన్నాడు.

కౌశల్‌ ఆర్మీ అనేది ఒక బూటకం, కొందరు ఆడుతున్న నాటకంలో మరికొందరు భాగస్వామ్యం అవుతున్నారు.బిగ్‌బాస్‌ ఇంట్లో నేడు మంచి అనిపించిన వారు రేపు చెడు అవుతారు.

అలాంటిది కౌశల్‌కు ఎందుకు బిగ్‌బాస్‌ ద్వారా ఇంత మంది అభిమానులు అయ్యారు అంటూ బాబు గోగినేని ప్రశ్నిస్తున్నారు.త్వరలోనే కౌశల్‌ ఆర్మీ గురించి తాను కొన్ని ఆసక్తికర విషయాలను నిగ్గు తేల్చుతాను అంటూ బాబు గోగినేని సవాల్‌ విసిరాడు.కౌశల్‌ ఆర్మీ వల్లే బాబు గోగినేని ఎలిమినేట్‌ అయ్యాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..