బాబు చిట్టి ... ఇదిగో నీ అవినీతి చిట్టా..లెక్కలు తీస్తోన్న బీజేపీ  

Babu Chitta Ni Bayata Pedutanantunna Bjp -

చంద్రబాబు ని మళ్ళీ టార్గెట్ చేసుకుని బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు.బాబు విషయం లో కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉంటున్న బీజేపీ మళ్ళీ సందర్భం లేకుండానే రాష్ట్ర నాయకులతో తిట్టుస్తోంది.

ఇదే సమయంలో బాబు హయం లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటపెట్టి ఆయన మీద బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది.దీనికి టీడీపీ కూడా ఘాటుగానే సమాధానాలు చెప్పేందుకు సిద్ధం అవుతోంది.

బాబు చిట్టి … ఇదిగో నీ అవినీతి చిట్టా..లెక్కలు తీస్తోన్న బీజేపీ-Political-Telugu Tollywood Photo Image

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో రాజకీయంగా టీడీపీ ని దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రాకుండా పావులు కదుపుతోంది.అందుకే టీడీపీ హయం లో ప్రాజెక్టులు, పథకాల వెనుక జరిగిన అవినీతి చిట్టాను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది.

బీజేపీ న‌మ్మించి మోసం చేసిందని, అన్యాయం చేస్తోందంటూ సీఎం చంద్రబాబు అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నారు.నిన్నమొన్నటి వ‌ర‌కు ఈ విష‌యంలో మౌనంగా ఉన్న బీజేపీ నేత‌లు ఇప్పుడు బాబుకు ధీటుగా బ‌దులిచ్చేందుకు సిద్ధమ‌వుతున్నారు.చంద్రబాబు అంటే ఒంటి కాలిపై లేచే బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోసారి ఆయ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుని విమ‌ర్శనాస్త్రాలు సంధించారు.

సీఎం చంద్రబాబుతో పాటు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌రో మంత్రిని టార్గెట్ చేశారు.చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూనే.ఆ మంత్రి ఏకంగా రూ.9వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ లెక్కలు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు పరిపాలన అంత అవినీతితో నిండిపోయిందని, దాదాపు అరవై వేల కోట్ల అవినీతి విజయవంతంగా సాగిందని వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.ఇందులో ఒక్క మంత్రి వాటానే రూ.30000 కోట్లని విమర్శలు చేశారు.తనమంత్రి వర్గ సహచరుల అవినీతి కోసం చంద్రబాబు నిధులన్నీ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

దేశంలో ఎన్ ఆర్ జీఎస్ కింద సంవత్సరానికి 40వేల కోట్లు కేటాయిస్తే 9వేల కోట్లు కేవలం ఏపీకి ఇస్తున్నారు.వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంద‌ని సోము విమర్శించాడు.

`సర్వశిక్షాఅభియాన్ లో పోస్టులు అమ్ముకుంటున్నారు.గ్రామాల్లో సిమెంట్ రోడ్లు – ఎల్ ఈడీ బల్బులు, ఇల్లులు, 24 గంటల కరెంట్, నీరు చెట్టు, ప్రధాన మంత్రి భీమా, మరుగుదొడ్లు వంటి వాటిని కేంద్రమే భరిస్తుంది.

కానీ అదంతా రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం కింద చూపించి టీడీపీ లాభపడుతోందని వీర్రాజు నిప్పులు చెరిగారు.ఇప్పటికే వస్తున్న నిధులు కాకుండా అప్పులను తెస్తూ రాష్ట్రాన్ని మరింత రుణభారంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తంచేశారు.

తెలుగుదేశం పార్టీ నేతలకు అసహనం పెరిగిపోయి తమ నాయకులపై దాడులు చేయిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.ఈ ఆరోపణలు అన్నిటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి బీజేపీకి బుడ్డి చెప్పాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది.

ఈ రెండు పార్టీల ఆరోపణలు.ప్రత్యారోపణలతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు