బాబు గారు అంతొద్దు! కీలక సూచనలు చేసిన వ్యూహకర్త ?

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ మధ్యకాలంలో స్పీడ్ పెంచారు.తన ప్రసంగాలలో దూకుడుగా డైలాగులు చెబుతున్నారు.

 Babu! A Strategist Who Made Key Suggestions, Chandrababu, Tdp, Bjp, Congress, Ys-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెబుతూనే , తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్ది వైసిపి పై విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలో బాబు చేస్తున్న వ్యాఖ్యలు మరి శృతిమించుతున్నట్లుగా అందరూ అభిప్రాయపడుతున్నారు.

ప్రజలను,  పార్టీ శ్రేణులలోను ఉత్సాహం కలిగించేందుకు చంద్రబాబు ఈ స్థాయిలో దూకుడుగా ప్రసంగాలు చేస్తున్నారు.చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు భారీగా జనాలు హాజరవుతున్న క్రమంలో వారిని చూసిన ఉత్సాహంలో చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బాబు చేస్తున్న ప్రసంగాలు కాస్త శృతి మించినట్లుగా కనిపిస్తుండడంతో , టిడిపి రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ రంగంలోకి దిగారు.

 ఈ మేరకు చంద్రబాబు ప్రసంగాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించినట్లు సమాచారం.

రాయలసీమ లో నిర్వహించిన  సభలోనూ ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా కాస్త దూకుడుగా చంద్రబాబు డైలాగులు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

దీనిపై ట్రోల్స్ కూడా నడిచాయి.అయితే చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కావడం , ఇప్పటికి హుందాగా రాజకీయాలు చేస్తుండడంతో తన ప్రసంగాల్లో మాట తీరును కాస్త తగ్గించుకుని మాట్లాడితే బాగుంటుందని రాబిన్ శర్మ టీం సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం టిడిపికి వ్యతిరేకంగా వైసీపీ ఏ తరహాలో వ్యూహాలు రచిస్తోందో వాటిని తిప్పికొట్టేందుకు ఏ విధంగా ప్రసంగాలు చేయాలనే విషయంపై బాబుకు పలు సూచనలు చేశారట.కేవలం చంద్రబాబు మాత్రమే కాకుండా , ఆ పార్టీ కీలక నాయకులు మీడియా సమావేశాల్లో వైసిపి నీ , ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాల కారణంగా టిడిపికి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందనే విషయాన్ని రాబిన్ శర్మ టీం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లిందట.
 

Telugu Ap, Chandrababu, Congress, Analasist, Stratagy, Rabin Sarma, Ysrcp-Politi

  ఈ మేరకు చంద్రబాబుతో పాటు,  పార్టీ కీలక నాయకులు అందరికీ ప్రసంగాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని , ఆవేశపూరితంగా మాట్లాడడం వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని సూచించారట.ముందు ముందు జరగబోయే చంద్రబాబు సభల్లో ఈ మేరకు ఆ తరహా మార్పులు కనిపించే అవకాశం ఉన్నట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube