వెల్లడైన తుదితీర్పు... వారంతా నిర్దోషులే అంటూ....

గత 28 ఏళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.బాబ్రీ మసీదు కేసులో నేడు సంచలన తీర్పు వెల్లడైంది.

 Babri Masjid Demolition Case: Special Cbi Court To Pronounce Its Verdict Today,-TeluguStop.com

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు.దాదాపు 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి చదివి వినిపించారు.1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు.మొత్తం 49 మందిపై అభియోగాలు నమోదు కాగా.దర్యాప్తు సమయంలో 17మంది మృతి చెందారు.2009లో నివేదిక సమర్పించగా అప్పటి నుంచి కూడా డైలీ విచారణ మొదలైంది.దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది.ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్‌ జోషి,ఉమాభారతి తో పాటు సంఘ్ ‌పరివార్‌ నేతలు కూడా చాలా మందే ఉన్నారు.

అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది కూడా నిర్దోషులే అంటూ కోర్టు తీర్పు వెల్లడించింది.వీరు నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని… సీబీఐ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందంటూ కోర్టు అభిప్రాయపడింది.

బాబ్రీ కేసు తుది తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశాలు జారీ చేయగా,కోర్టు కు 11 మంది హాజరుకాలేదు.ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఉండగా, వారిలో విచారణ సమయంలో 17 మంది మృతి చెందడం తో తుది తీర్పు వెల్లడయ్యే సమయంలో మొత్తం 32 మంది నిందితులుగా ఉండగా,వారిలో 21 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
మరో ఆరుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్లు తెలుస్తుంది.కోర్టుకు హాజరైన నిందితుల్లో అద్వానీ, మురళీ మనోహర్‌ జోషితో పాటు యూపీ‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్‌ కటియార్‌, పవన్‌ పాండే, సుధీర్‌ కక్కర్ వంటి వారు కూడా ఉన్నారు.

దీనితో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube