బాబ్రీ మసీదు కేసులో అద్వానీ వాంగ్మూలం..!

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు బీజేపీ సీనియర్ నేత ఎల్‎కే అద్వానీ వాంగ్ములాన్ని నమోదు చేసింది.అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు విచారణను వేగవంతం చేసింది.

 Babri Majsid Case, Ayodhya, Cbi Special Court, Bjp Leader, Lk Adhvani, Babri Dem-TeluguStop.com

సీఆర్‎పీసీలోని 313 సెక్షన్ కింద ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మంది వాంగ్మూలాల ప్రక్రియను లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టు ప్రతిరోజు నమోదు చేస్తోంది.రోజుకు ఒకరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగుల్మాలను నమోదు చేస్తోంది.

తాజాగా శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ వాంగ్మూలాన్ని సీబీఐ స్పెషల్ కోర్టు నమోదు చేసింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు.

గురువారం బీజేపీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ స్పెషల్ కోర్టు తీసుకుంది.తాను నిర్దోషినని, ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా కేసులు పెట్టిందని జోషి ఆరోపించారు.

ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న వారంతా దొంగ సాక్ష్యలని మండిపడ్డారు.అంతకు ముందు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సీబీఐ కోర్టు ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube