బాబోయ్.. అక్కడ కేవలం ఒక్కసారే టాయిలెట్ కి వెళ్ళాలట.. అంతకన్నా ఎక్కువైతే ఫైన్ కట్టాల్సిందే..!  

baboy there is only one way to go to the toilet more than that you have to pay a fine, tolits, offcie, company, one time,social media, employees, manager - Telugu Company, Employees, Manager, Offcie, One Time, Social Media, Tolits

ఒక కంపనీలో ఉద్యోగం చేసే వాళ్లు ఎంత లేదన్నా ఆఫీసులో ఒక 8 గంటలు పాటు పని చేయాలి కదా.అలా పని చేసే క్రమంలో ఆ ఉద్యోగి 8 గంటల్లో టాయ్ లెట్ కు కనీసం రెండు మూడు సార్లన్నా వెళ్లవలిసి వస్తుంది కదా.! అయితే చైనాలోని ఓ కంపెనీలో మాత్రం ఒక వింత రూల్ ఒకటి ఉంది తెలుసా.దాని గురించి మీరు వింటే నోరు వెళ్లబెడతారు.

TeluguStop.com - Baboy There Is Only One Way To Go To The Toilet More Than That You Have To Pay A Fine

అది ఏంటంటే.అక్కడ పని చేసే ఉద్యోగులు ‘‘రోజుకు ఒకే ఒక్కసారి’’ మాత్రమే టాయ్ లెట్ కు వెళ్లాలట.

అలాకాకుండా ఒకసారికి మించి ఎక్కువ సార్లు వెళితే “ఫైన్’’ వేస్తామంటోంది అక్కడ కంపనీ.మరి ఘోరం కదా.వినే మనకే ఇలా వింటే.పాపం ఇక ఆ ఉద్యోగుల పరిస్థితి తలచుకుంటేనే బాధేస్తుంది కదూ.అయితే, ఈ రూల్ పెట్టడానికి సదరు కంపెనీ ఏమంటోందో చుడండి.టాయిలెట్‌ లో కూర్చొని టైంపాస్ చేద్దామంటే కుదురదు.

TeluguStop.com - బాబోయ్.. అక్కడ కేవలం ఒక్కసారే టాయిలెట్ కి వెళ్ళాలట.. అంతకన్నా ఎక్కువైతే ఫైన్ కట్టాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image

చేసే పని ఏది అయినాగాని ఒక్కసారే కంప్లీట్ చేసుకుని రావాల్సిందే.లేదంటే మళ్లీ వెళదామనుకుంటే మాత్రం ఫైన్ తప్పదంటోంది.

అయితే ఈ రూల్ పనిచేయడానికి బద్దకించే ఉద్యోగుల కోసమే ఈ రూల్ పెట్టామని ఆ సంస్థ చెబుతుంది.

చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌ లో ఉన్న డోంగ్గువాన్‌ లో గల అన్పు ఎలక్ట్రిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ ఉద్యోగులకు కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది.తమ సంస్థలోని ఉద్యోగులు రోజులో ఒకే ఒక్కసారి టాయ్ లెట్ కు వెళ్లాలని అంతకంటే ఎక్కువసార్లు టాయిలెట్ వాడితే 20 యువాన్ (3 యూస్ డాలర్లు, ఇండియా కరెన్సీ అయితే రూ.227) జరిమానా చెల్లించాలని నిబంధన పెట్టింది.ఈ నిబంధన ఇష్టం లేని కొంతమంది ఉద్యోగులు సంస్థ నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌ గా మారింది.

దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో ఆ కంపెనీ సమాధానం ఇస్తూ.

‘‘కొంతమంది ఉద్యోగులు పని తప్పించుకోవటానికి టాయిలెట్ పేరుతో సమయం వృథా చేస్తున్నారని.స్మోకింగ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారనీ తెలిపింది.ఎటువంటి వారి కోసమో ఈ రూల్ పెట్టాల్సి వచ్చింది’’ అని సంస్థ మేనేజర్ కావో ఓ టీవీ చానెల్‌కు తెలిపారు.దీంతో వారిలో మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు.

అలాగే ఈ రూల్ అతిక్రమించే ఉద్యోగి నుంచి నేరుగా జరిమానా తీసుకోబోమని.ఆ జరిమానాను వారికిచ్చే జీతం నుంచి కట్ చేస్తామని తెలిపారు.

మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నాగాని పాపం డయాబెటిస్ ప్రాబ్లం ఉన్నవారి గురించి అయిన ఆలోచిస్తే బాగుంటుంది కదా.

#Tolits #Social Media #Offcie #Manager #Employees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు