సింహం పిల్లను ఎత్తుకెళ్లిన కొండముచ్చు... వీడియో వైరల్  

Baboon Steals Lion Baby In South Africa Video Goes Viral In Internet - Telugu Baboon, Internet, Lion Baby, South Africa, Viral Video

సాధారణంగా సింహాలను చూసినా సింహపు పిల్లలను కొండముచ్చు భయపడుతుంది.సింహం కనపడితే చాలా దూరం పారిపోతుంది.

Baboon Steals Lion Baby In South Africa Video Goes Viral In Internet

కానీ దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్ లో మాత్రం ఒక కొండముచ్చు సింహపు పిల్లను ఎత్తుకొని ఆడించింది.జాతి వైరం ఉన్నా ఆ కొండ ముచ్చు మాత్రం సింహపు పిల్లలను ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంది.

కొండముచ్చు తన సొంత పిల్లలతో ఏ విధంగా ఆడుకుంటుందో అదే విధంగా సింహపు పిల్లతో కూడా ఆడుకుంది.

ఫిబ్రవరి 1వ తేదీన ఈ అరుదైన సంఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్ లోని క్రూగర్ నేషనల్ పార్క్ లో చోటు చేసుకుంది.

పార్క్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నో సంవత్సరాల నుండి ఈ పార్క్ లో పని చేస్తున్నామని అయినప్పటికీ ఇలాంటి అరుదైన ఘటనను మాత్రం తాము ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.ఆ పార్క్ కు వచ్చిన సందర్శకులు కూడా ఈ అరుదైన ఘటనను వీక్షించారు.

కొందరు సందర్శకులు తమ మొబైల్ ఫోన్లలో కొందముచ్చు సింహపు పిల్లను ఎత్తుకెళుతున్న ఫోటోలను, వీడియోలను తీసి సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.ఈ వింత ఘటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లు ఈ ఫోటోలు, వీడియోల గురించి ఫన్నీ కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు