పెళ్లయి ఏడాది కూడా కాలేదు రెండో భార్యకు విడాకులు ఇస్తున్న నటుడు పృథ్వీ ?

టాలెంటెడ్ అండ్ సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ ( Babloo Prithiveeraj ) చైల్డ్ ఆర్టిస్ గానే తన కెరీర్ ను ప్రారంభించారు.ఇలా నటుడిగా తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోగా విలన్ పాత్రలలోను నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Babool Pruthvi Raj Rukhmini Seethal Divorce Rumours Goes Viral, Prithvi Raj, Ruk-TeluguStop.com

తాజాగా యానిమల్( Animal )సినిమాలో కూడా కీలకపాత్రలో నటించడం సంగతి మనకు తెలిసిందే.ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పృథ్వీ వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే.

పృథ్వీరాజ్ 1994లో బీనాను పెళ్లి చేసుకున్నారు.వీరికి ఆ తర్వాత ఏడాదికే కొడుకు అహెద్ మోహన్ జబ్బర్ జన్మించారు.

Telugu Divorce, Kollywood, Prithvi Raj-Movie

ఇలా కొంతకాలం పాటు ఎంతో అన్యోన్యంగా సాగినటువంటి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.ఇలా మనస్పర్ధలు రావడంతో కొన్ని సంవత్సరాలు పాటు వేరుగా ఉంటున్నటువంటి ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.అయితే విడాకులు తీసుకున్నటువంటి ఈయన కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయి రుక్మిణి శీతల్( Rukmini Seethal )అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు.ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే విషయం తెలియడంతో ఈ జంటపై భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా వచ్చాయి.56 సంవత్సరాల వ్యక్తి 23 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Telugu Divorce, Kollywood, Prithvi Raj-Movie

ఇక వీరికి గత ఏడాది వివాహం జరిగింది.అయితే వివాహం జరిగి ఏడాది కూడా కాకుండా అని వీరిద్దరు విడాకులు ( Divorce ) తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.అయితే వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి సరైన కారణం ఏంటి అనే విషయం తెలియలేదు.

కానీ రుక్మిణి శీతల్ తన అఫిషీయల్ అకౌంట్ నుంచి పృథ్వీరాజ్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోలను డిలీట్ చేయడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఈమె వాటన్నింటిని తొలగించిందని దీంతో వీరు కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారన్న రూమర్ పుట్టుకొచ్చింది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మాత్రం తెలియడం లేదు.

ఇదివరకు విడాకులు తీసుకున్నటువంటి నిహారిక, సమంత, శ్రీజ వంటి వారు కూడా ఇలాగే వారి ఫోటోలను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈమె కూడా తన భర్తతో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను డిలీట్ చేయడంతో విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube