బాబోయ్, ఇదేం స్టంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు.. వీడియో వైరల్!

యోగాలో అత్యంత కష్టమైన ఆసనాల్లో శీర్షాసనం, బకాసనం, చక్రాసనం, వృశ్చికాసనం ముందు ఉంటాయి.వృశ్చికాసనం వేయాలంటే చాలా సాధనతో పాటు అద్భుతమైన శక్తి కావాలి.

 Baboo, This Is A Stunt Guinness World Record Breaking Video Goes Viral, Excelle-TeluguStop.com

అప్పుడే ఈ భంగిమలో ఎక్కువసేపు ఉండటం సాధ్యమవుతుంది.అయితే తాజాగా ఒక యోగా గురువు ఈ భంగిమలో ఏకంగా 30 నిమిషాల పాటు స్థిరంగా ఉండి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

దీంతో ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలైంది.తాజాగా అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఈ యోగా గురువుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది.

ఎక్కువ సేపు వృశ్చికాసనంలో ఉన్న వ్యక్తిగా ఇతడు రికార్డు సృష్టించాడని పేర్కొంది.

వివరాల్లోకి వెళితే… దుబాయ్‌లో ఇండియన్ యోగా శిక్షకుడు యష్ మన్సుఖ్ భాయ్ మొరాదియా నివసిస్తున్నాడు.

తాజాగా ఇతడు దాదాపు 30 నిమిషాల పాటు స్కార్పియన్ భంగిమలో ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో యష్ యోగా మ్యాట్‌పై వృశ్చికాసనం వేయడం చూడవచ్చు.

ఈ భంగిమలో అతను 29 నిమిషాల 4 సెకన్లు ఉన్నాడని.ఇప్పటివరకు ఇది ఎవరికీ సాధ్యం కాలేదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీసర్స్ వెల్లడించారు.

యష్ తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కిన తర్వాత మాట్లాడాడు.‘వృశ్చికాసనాన్ని స్కార్పియన్ పోజ్ అని ఇంగ్లీష్‌లో పిలుస్తారు.ఈ పవర్‌ఫుల్‌ యోగాసనం చేయాలంటే రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ తప్పనిసరి.ఈ ఆసనంలో వీపు వెనుక నుంచి కాళ్లను ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది.ఈ ఆసనం కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న తేలు లాగా ఉంటుంది’ అని యష్ పేర్కొన్నాడు.అయితే ఈ ఆసనాన్ని ఎక్కువసేపు చేసినా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి స్టంట్స్ చేసేముందు యోగా గురువులను సంప్రదించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube