రెండు రొట్టెలతో నెలకు 70 వేలు సంపాదిస్తున్న హర్యానా మహిళ..?  

babita parmer from haryana earning 70k per month through youtube, Haryana, Nowrangabadh, Youtube, Babitha, Indian Girl Babithas Village, Ranjith, 4 Lacks Youtube Subcribers - Telugu 4 Lacks Youtube Subcribers, Babitha, Haryana, Indian Girl Babithas Village, Nowrangabadh, Ranjith, Youtube

మనలో చాలామంది డబ్బు సంపాదించడం చాలా కష్టం అని భావిస్తూ ఉంటారు.అయితే మనలో ఉండే ప్రతిభను మనం గుర్తించగలిగితే సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యమే.

TeluguStop.com - Babita Parmer From Haryana Earning 70k Per Month Through Youtube

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

హర్యానాలోని నౌరంగాబాద్‌ అనే చిన్న పల్లెటూరుకు చెందిన బబిత అనే మహిళ ఒకరోజు కట్టెల పొయ్యిపై ప్రతిరోజూలానే రొట్టెలు చేసింది.అయితే ఇతరులతో పోలిస్తే బబిత భిన్నంగా రొట్టెలు చేస్తుండటంతో ఆమె మరిది వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు.

TeluguStop.com - రెండు రొట్టెలతో నెలకు 70 వేలు సంపాదిస్తున్న హర్యానా మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image

యూట్యూబ్ లో బబిత చేసిన రొట్టెల వీడియో వైరల్ కావడంతో ఆమెకు లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు పెరిగారు.అలా రొట్టెల వీడియోతో పాపులర్ అయిన బబిత నెలకు ఎనిమిది వంటల వీడియోలను అప్ లోడ్ చేస్తూ 70 వేల రూపాయలు సంపాదిస్తోంది.

హర్యాణాలోని నౌరంగాబాద్‌ కు చెందిన వ్యక్తితో బబితకు 2017లో వివాహమైంది.చూడటానికి బాగా, తినడానికి రుచిగా ఉండే వంటలను బబిత రోజూ తయారు చేసేది.

అయితే బబిత వంట చేసే విధానం ఎంతో బాగుందని గ్రహించిన మరిది రంజిత్ వదినను ఒప్పించి ‘ఇండియన్‌ గర్ల్‌ బబితాస్‌ విలేజ్‌’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ‘పిండి బాగా కలపడం ఎలా’ అనే వీడియోను పోస్ట్ చేశారు.అయితే ఆ వీడియో సక్సెస్ కాలేదు.

ఆ తర్వాత మొదటి వీడియోలోని తప్పులను గ్రహించి రంజిత్ ‘మృదువైన రొట్టెలు తయారు చేయడం ఎలా అనే వీడియోను పోస్ట్ చేశాడు.

అయితే ఊహించని విధంగా 48 గంటల్లో ఆ వీడియోకు మిలియన్ వ్యూస్ వచ్చాయి.

బబిత తయారు చేసిన సరికొత్త వంటకాలు వీక్షకులకు నచ్చడంతో ఆమెకు మెల్లగా అభిమానుల సంఖ్య పెరిగింది.యావరేజ్ గా చూసుకుంటే నెలకు 70 వేల రూపాయలు బబిత ఖాతాలో జమయ్యేవి.

ఇప్పటివరకు బబిత యూట్యూబ్ ఛానల్ లో 124 వీడియోలను మాత్రమే అప్ లోడ్ చేయగా ఆ ఛానల్ కు నాలుగున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉండటం గమనార్హం.

#Babitha #4Lacks #IndianGirl #Haryana #Ranjith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Babita Parmer From Haryana Earning 70k Per Month Through Youtube Related Telugu News,Photos/Pics,Images..