రేపటి ఆశ మీరే బాబాయ్.. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై నిహారిక ట్వీట్!

టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Babi You Are The Hope Of Tomorrow Niharika Tweet On Pawan Kalya Politics Nihari-TeluguStop.com

ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను ఆదుకోవడం కోసం కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.కౌలు రైతు భరోసా యాత్ర లో భాగంగా మరణించిన రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చడం తో పాటుగా ఆయా కుటుంబాలకు లక్ష రూపాయలు అందించి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

చనిపోయిన ఆ రైతు కుటుంబాలకు ఎటువంటి కష్టం వచ్చినా తాను ఉన్నాను అన్న భరోసా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.

అలాగే బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆయన ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేశారు.

రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇటీవల మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చి 35 లక్షలను కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి అందించారు.మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌ 10 లక్షల రూపాయలు, సాయిధరమ్‌ తేజ్‌ 10 లక్షలు, వైష్ణవ్‌ తేజ్‌ 5 లక్షలు, నిహారిక 5 లక్షలు, మరొకరు 5 లక్షల రూపాయలను అందించి మంచి మనసు చాటుకున్నారు మెగా ఫ్యామిలీ.

ఆత్మహత్యకు పాల్పడిన అన్నదాతల బిడ్డల భవిష్యత్ గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో తమ కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం అందించారని చెబుతూ వారందరినీ అభినందించారు పవన్ కళ్యాణ్.

Telugu Niharika, Pawan Kalyan, Tollywood, Tweet-Movie

అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక స్పందిస్తూ థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయ్.అంటూ ఆనందం వ్యక్తం చేసింది.ప్రజల సహాయం చేయడంలో తమకు కూడా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు చెప్పింది.

నేను ఎప్పుడు ఎదురు చూసే నాయకుడు మీరు.ప్రజలకు మంచి రోజులు తీసుకురావడం మీ వల్లే సాధ్యమవుతుంది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది నిహారిక.

ప్రస్తుతం మెగా డాటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube