వ్యాక్సిన్ వేయించుకుంటానని ప్రకటించిన బాబా రాందేవ్.. డ్రగ్ మాఫియాపైనే తన పోరాటం..!

కరోనా టైం లో డాక్టర్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తుంటే అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఐ.

 Baba Ramdev Planing To Take Corona Vaccine-TeluguStop.com

ఎం.ఏ సీరియస్ అయ్యింది.రాందేవ్ మీద దేశద్రోహం కేసు కూడా పెట్టాలని కేంద్రాన్ని కోరింది.ఇదిలాఉంటే సడెన్ గా తాను కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు సిద్ధమని ప్రకటించారు బాబా రాందేవ్.జూన్ 21 నుండి దేశ ప్రజలదరికి ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.18 ఏళ్లు పై బడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రధాని ప్రకటించారని రాం దేవ్ చెప్పారు.తాను కూడా త్వరలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నా అని చెప్పారు.దేశ ప్రజలంతా యోగా, ఆయుర్వేదాన్ని భాగస్వామ్యం చేసుకోవాలని బాబా రాందేవ్ అన్నారు.యోగా అనేది వ్యాధులన్నిటిని నివారించే కవచం లా పనిచేస్తుందని చెప్పారు.కరోనా నుండి యోగా రక్షిస్తుందని పేర్కొన్నారు.

శస్త్రచికిత్స లాంటివి అత్యవసర పరిస్థితుల్లో అల్లోపత్నే ఉత్తమ వైద్యమని చెప్పారు రాం దేవ్ బాబా.తాను వైద్య వ్యవస్థని ద్వేషించడం లేదని తన పోరాటం డ్రగ్ మాఫియా పైన అని అన్నారు.

 Baba Ramdev Planing To Take Corona Vaccine-వ్యాక్సిన్ వేయించుకుంటానని ప్రకటించిన బాబా రాందేవ్.. డ్రగ్ మాఫియాపైనే తన పోరాటం..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంచి వైద్యులు భూమి మీద దేవదూతల లాంటి వారని అన్నారు.అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని వైద్యులకు హితవు పలికారు.

ప్రభుత్వం అందిస్తున్న జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు.

#Pathanjali #Corona Vaccine #YogaGuru #Take #BabaRamdev

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు