సుమ కాళ్లపై పడ్డ బాబా భాస్కర్.. అసలేం జరిగిందంటే..?

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా సుమ మాత్రం వరుస అవకాశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు.ఈ ఛానల్, ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెళ్లలో ప్రోగ్రామ్స్ చేయడం సుమ ప్రత్యేకత.

 Baba Bhaskar Punches On Suma In Start Music Show, Baba Bhaskar , Start Music Sho-TeluguStop.com

చేసిన ప్రతి షోతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న సుమ స్టార్ మా ఛానెల్ లో స్టార్ట్ మ్యూజిక్ అనే ప్రోగ్రామ్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా స్టార్ట్ మ్యూజిక్ ప్రోమో విడుదల కాగా ఈ షోకు బాబా భాస్కర్, అనీ మాస్టర్, మరి కొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.

కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్ ఏ షోలో పాల్గొన్నా పంచ్ లు వేయడంతో పాటు సందడి చేస్తూ షోలు హిట్ అయ్యేలా చేస్తున్నారు.బాబా భాస్కర్ షోలో సుమ కాళ్ల మీద పడటానికి ప్రయత్నం చేసి చివరకు సుమ ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆ తరువాత బాబా మాస్టర్ నా మమ్మీ చెప్పారు అని చెబుతుంటే సుమ “పెద్దవాళ్లను చూస్తే ఆశీర్వాదం తీసుకోమనా.ఇది కాకుండా వేరే జోకులేం లేవా” అని పంచ్ వేశారు.

ఆ తరువాత బాబా భాస్కర్ దేశముదురు అని బాగా ముదిరిపోయారంటూ సుమ పంచ్ వేస్తారు.అనీ మాస్టర్ ఈ షోకు ఎందుకు వచ్చారని ఓల్డేజ్ డొనేషన్ ఏమైనా కావాలా.? అని ప్రశ్నించారు.ఆ తరువాత బాబా మాస్టర్ దగ్గరకు సుమ వెళ్లి “నేను మళ్లీ మరిచిపోతాను గిన్నెలు తోమడానికి పీచు కావాలి” అంటూ బాబా మాస్టర్ గడ్డాన్ని చూపిస్తూ అంటారు.

ఆ పంచ్ కు షోలో అందరూ పకపకా నవ్వేస్తారు.

ఆ తరువాత సుమ, బాబా భాస్కర్ థిల్లానా థిల్లానా పాటకు డ్యాన్స్ చేశారు.

మగధీర మూవీలోని పంచదార బొమ్మాబొమ్మ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే కాగా ఈ పాటను మీరే కంపోజ్ చేశారు కదా మాస్టర్ అని సుమ అనగా కీరవాణి గారు పాటను కంపోజ్ చేశారని తాను కేవలం డ్యాన్స్ చేశానని బాబా మాస్టర్ పంచ్ లు వేసి కడుపుబ్బా నవ్వించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube