బాబా భాస్కర్‌ రూ.25 లక్షలు తీసుకుని ఉంటే..!

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ముగిసింది.అద్బుతమైన స్పందన వచ్చింది అంటూ స్టార్‌ మాటీవీ వారు ప్రకటించారు.

 Baba Bhaskar Will Taken25crores What Will Goingtodon-TeluguStop.com

అయితే గత సీజన్‌లతో పోల్చితే ఈ సీజన్‌కు కాస్త తక్కువ రేటింగ్‌ వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు.తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విన్నర్‌గా రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచాడు.

ఇక టాప్‌ 3 లో బాబా భాస్కర్‌ నిలవడం అందరిని ఆశ్చర్యపర్చింది.అలీ బయటకు వెళ్లిన తర్వాత టాప్‌ 4 ఉన్న సమయంలో శ్రీకాంత్‌ లోనికి వెళ్లి బాబా భాస్కర్‌ మరియు ఇతర కుటుంబ సభ్యులకు 20 లక్షల రూపాయలు ఆఫర్‌ చేశాడు.

ఆ 20 లక్షలు తీసుకుని బయటకు వచ్చేయవచ్చు అంటూ ఆఫర్‌ ఇచ్చాడు.కాని ఆ ఆఫర్‌కు వరుణ్‌ మరియు బాబా భాస్కర్‌లు నో చెప్పారు.ఆ తర్వాత టాప్‌ 3 ఉన్న సమయంలో కూడా అనూహ్యంగా 25 లక్షల రూపాయలను అంజలితో బాబా భాస్కర్‌కు ఆఫర్‌ ఇచ్చారు.కాని అది కూడా బాబా వద్దనుకున్నాడు.

మొదట కాస్త టెంమ్ట్‌ అయినట్లుగా అనిపించినా కూడా చివరకు కుటుంబ సభ్యులు వద్దనడంతో వదిలేశాడు.

Telugu Baba Bhaskar, Rahul Sipligunj, Srimukhi, Telugu Ups-

బాబా భాస్కర్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో 25 లక్షల రూపాయలు వదిలేశాడు అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు.కాని బాబా భాస్కర్‌ ఆ డబ్బును తీసుకుని ఉంటే అదే నెటిజన్స్‌ ఆయన్ను తీవ్రంగా విమర్శించే వారు.విన్నింగ్స్‌ చాన్స్‌ ఉన్నా కూడా డబ్బుకు కక్కుర్తి పడి మరీ ఇలా చేశారు అంటూ విమర్శలు ఎదుర్కొనే వారు.

ఆయన విజేత అవ్వాలని కోరుకున్న వారు చాలా మంది ఓట్లు వేశారు.వాళ్లు అంతా కూడా తాము గెలుస్తాడని ఓట్లు వేస్తే ఇలా చేశాడు ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసే వారు.

అందుకే బాబా డబ్బులు తీసుకోక పోవడం మంచిది అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube