కమెడియన్ పరువు తీసిన బాబా భాస్కర్.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో వెండితెరపై, బుల్లితెరపై కామెడీ, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వస్తున్న సినిమాలు, ప్రోగ్రామ్ లకు ఆదరణ బాగా ఉన్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ తరహాలో గతంలో కొన్ని ఛానెల్స్ ప్రోగ్రామ్స్ చేసినా ఆ ప్రోగ్రామ్స్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

 Baba Bhaskar Comments On Ashu Reddy Dress In Comedy Stars Show , Baba Bhaskar Se-TeluguStop.com

జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన జబర్దస్త్ తరహా కామెడీ షో అదిరింది ఆశించిన స్థాయిలో టీఆర్పీలు సాధించలేక ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో మాత్రం జబర్దస్త్ కు ధీటుగా టీఆర్పీ రేటింగ్ లను సాధించడంతో పాటు ఆ షోకు గట్టి పోటీని ఇస్తోంది.

గతంలో స్టార్ మా ఛానెల్ నిర్వాహకులు కెవ్వుకేక పేరుతో ఒక కామెడీ షో చేసినా ఆ షో క్లిక్ కాలేదు.కామెడీ స్టార్స్ షోకు మాత్రం ఆ షో నిర్వాహకులు అదనపు హంగులు జోడిస్తూ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగే విధంగా చేస్తున్నారు.

తాజాగా కామెడీ స్టార్స్ ప్రోమో విడుదల కాగా అషురెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి క్రాక్ సినిమాలోని భల్లేగా తగిలావే బంగారం పాటకు డ్యాన్స్ చేస్తారు.ఆ పాటలో అషురెడ్డి చిన్న గౌను లాంటి డ్రెస్ వేసుకోగా ఎక్స్ ప్రెస్ హరి ఫ్లోర్ మూవ్ మెంట్స్ వేస్తారు.ఎక్స్ ప్రెస్ హరి అలా ఫ్లోర్ మూవ్ మెంట్లు వేయడంపై శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్ సెటైర్లు వేశారు.నాకు తెలిసి కొరియోగ్రాఫర్ ను నువ్వు అడిగావు కదా ఫ్లోర్ మూవ్ మెంట్ కావాలని అని శేఖర్ మాస్టర్ అడగగా బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్ ను అడగలేదని కాస్ట్యూమర్ ను అడిగాడని పంచ్ వేసి ఎక్స్ ప్రెస్ హరి పరువు తీసేశారు.

బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్ ఒకవైపు డ్యాన్స్ షోలకు జడ్జీలుగా వ్యవహరిస్తూ మరోవైపు కామెడీ షోలతో కూడా బిజీ అవుతున్నారు.ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీ అయిన శ్రీదేవి కూడా ఈ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube