సుధీర్ వేస్ట్.. రష్మి ట్రిపుల్ వేస్ట్ అంటున్న బాబా భాస్కర్?  

baba bhaskar comments on sudigali sudheer, Rashmi, Sudheer, Baba Baskar, Big Boss, Dhee Dance Show, Shekar Master, Varshini - Telugu Baba Baskar, Big Boss, Dhee Dance Show, Rashmi, Shekar Master, Sudheer, Varshini

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ బాబా భాస్కర్ ను ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం బిగ్ బాస్ షో అనే చెప్పాలి.బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న బాబా భాస్కర్ సీజన్ 3 విన్నర్ కావాలని రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు భావించారు.

TeluguStop.com - Baba Bhaskar Punces On Sudigali Sudheer

తెలుగు స్పష్టంగా పలకలేకపోయినా తన ఆటిట్యూడ్ తో బిగ్ బాస్ ప్రేమికుల మనస్సులను బాబా భాస్కర్ దోచుకున్నారు.బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాలేకపోయినా ప్రేక్షకుల హృదయాలను మాత్రం విన్ అయ్యాడు.

తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో ఢీ ఛాంపియన్స్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.వచ్చే బుధవారం టెలికాస్ట్ అయ్యే ఈ ప్రోమోకు బాబా భాస్కర్ పంచులు హైలెట్ గా నిలిచాయి.

TeluguStop.com - సుధీర్ వేస్ట్.. రష్మి ట్రిపుల్ వేస్ట్ అంటున్న బాబా భాస్కర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

శేఖర్ మాస్టర్ బదులుగా బాబా భాస్కర్ ఈ షోకు హాజరయ్యాడని తెలుస్తోంది.ప్రోమోలో రజనీకాంత్ బాబా సినిమాలోని బాబా జస్ట్ వాట్ ఐ సే పాటతో బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చారు.

ఆ పాటకు స్టైల్ గా స్టెప్పులు వేసి సూపర్ అనిపించేలా చేశారు.

ఢీ షోలో ఇచ్చే టాస్క్ లో భాగంగా సుధీర్, రష్మి, హైపర్ ఆది, వర్షిణిలకు సిగ్నేచర్ మూమెంట్లు చేయాలని చెప్పగా బాబా భాస్కర్ సుధీర్ ది “ఎక్స్ట్రార్డినరీ బ్రైన్” అంటూ పంచ్ వేశాడు.

బాబా మాస్టర్ హైపర్ ఆదికి సిగ్నేచర్ మూమెంట్స్ నేర్పించగా ఆ మూమెంట్స్ వేయలేక హైపర్ ఆది పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.ఆ తరువాత ఆది వేసిన స్టెప్పులా సుధీర్ వేయలేడంటూ బాబా మాస్టర్ సుధీర్ గాలి తీసేశాడు.

ఆ తర్వాత డ్యాన్స్ పెర్ఫామెన్స్ చూసి సుధీర్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని బాబా భాస్కర్ కరోనా రోగిలా కూర్చున్నావ్ ఫైల్స్ ఉన్నాయా.? అని పంచ్ వేశాడు.ఆ తర్వాత సుధీర్ డబుల్ వేస్ట్, రష్మి ట్రిపుల్ వేస్ట్, వర్షిణి టోటల్లీ వేస్ట్ అని మరో పంచ్ వేశాడు.సుధీర్ ఎంకరేజ్ చేసినా వేస్ట్ వేస్ట్ అంటూ బాబా గాలి తీసేశాడు.

ఆ తర్వాత సుధీర్ లో టెంపరేచర్ లేదంటూ బాబా మాస్టర్ పంచులతో అలరించారు.

#Shekar Master #Big Boss #Rashmi #Varshini #Dhee Dance Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Baba Bhaskar Punces On Sudigali Sudheer Related Telugu News,Photos/Pics,Images..