శ్రీముఖి అమ్మ వచ్చినప్పుడు బాబా ఓవర్‌ యాక్షన్‌, ఆయన ఏమన్నాడో తెలుసా?  

Baba Baskar Comments On Srimukhi Mother - Telugu Baba Baskar, Baba Baskar Family Come And Meet, Baba Says Latha Medam So Beautifull Same Srimukhi Print, Family Members Meet, Siva Jyothi Family Come And Meet, Srimukhi Mother Latha Come And Meet Her Daughter

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 క్లైమాక్స్‌కు చేరింది.మరో రెండు వారాల్లో షో ముగియబోతున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించిన విషయం తెల్సిందే.

Baba Baskar Comments On Srimukhi Mother

ఈ పక్రియ మూడు రోజుల పాటు సాగింది.నిన్నటితో అందరు కంటెస్టెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చారు.

అలీతో మొదలుకుని నిన్న శ్రీముఖి వరకు అందరు కూడా కుటుంబ సభ్యులు రావడంతో చాలా ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీముఖి అమ్మ వచ్చినప్పుడు బాబా ఓవర్‌ యాక్షన్‌, ఆయన ఏమన్నాడో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

  శ్రీముఖి తల్లి లత వచ్చినప్పుడు బాబా బాగా ఎగ్జైట్‌ అయ్యాడు.శ్రీముఖితో పాటు బాబా బాస్కర్‌ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశాడు.లత గారు ఎంత అందంగా ఉన్నారో అంటూ ఆమెకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు దగ్గరుకు వెళ్తున్నారు, ఆమెను హగ్‌ చేసుకునేందుకు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

లతను హగ్‌ చేసుకునేందుకు బాబా ప్రయత్నించిన సమయంలో శివ జ్యోతి అక్కడ నుండి తీసుకు వెళ్లింది.ఆ తర్వాత కూడా బాబా ఆమె అందం గురించి మాట్లాడుతూనే ఉన్నాడు.

శ్రీముఖి లాగే అందంగా ఉందని, రామకృష్ణ(శ్రీముఖి తండ్రి) అచ్చు గుద్దినట్లుగా దించేశాడు అంటూ కామెడీ చేశాడు.

  శ్రీముఖి మరియు బాబా బాస్కర్‌ల మద్య సన్నివేశాలు, డాన్స్‌లు చాలా బాగుంటున్నాయని లత అనడంతో బాబా బాస్కర్‌ గాల్లో తేలిపోయాడు.ఆమె చేతిని తీసుకుని కళ్లకు అదుకుని ముద్దు పెట్టుకున్నాడు.మొత్తానికి లత ఉన్నంత సేపు బాబా బాస్కర్‌ ఒక కుర్రాడి మాదిరిగా మెలికలు తిరుగుతూ సరదాగా మాట్లాడుతూ ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

వెళ్లి పోయే సమయంలో కూడా అన్‌ ఫ్రీజ్‌ చేయగానే అయ్యో వెళ్లి పోయారా అంటూ స్పీడ్‌గా వెళ్లి డోర్‌ను ఆపేందుకు ప్రయత్నించాడు.నిన్నటి ఎపిసోడ్‌లో లత వచ్చిన సమయంలో బాబా బాస్కర్‌ ఓవర్‌ యాక్షన్‌ హైలైట్‌గా, కామెడీగా నిలిచిందని చెప్పుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Baba Baskar Comments On Srimukhi Mother Related Telugu News,Photos/Pics,Images..