జగన్ కి బాలినేని ఝలక్ ఇవ్వనున్నాడా..?

రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఈరోజు కలిసి ఉన్న వాళ్ళు మరు క్షణంలో కొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది…అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ,శాశ్వత మిత్రులు ఉండరని.ఇదిలాఉంటే అసలు ఇప్పుడు ఈ విషయాని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే.

 Baalineni Srinivas Reddy Shocking Decision On Ys Jagan Padayatra-TeluguStop.com

జగన్ కి భందువు అత్యంత సన్నిహితుడు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు జగన్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట అంతేకాదు జగన్ ని ,వైసీపిని వీదనున్నరనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయంసం అయ్యింది…వివరాలలోకి వెళ్తే.

వైసీపి అధినేత పై ప్రకాశం జిల్లా వైసేపి అధ్యక్షుడు బాలినేని అసంత్రుప్తిలో ఉన్నారట.

అందుకే జగన్ పాదయాత్ర సమయంలో కూడా కనపడలేదని తెలుస్తోంది.జగన్ పాదయాత్ర అదే జిల్లాలోని చీరాలలో జరుగుతోంది అలాంటిది బాలినేని మాత్రం యాత్రకి దూరంగా ఉడటం ఎన్నో అనుమానాలని రేకెత్తిస్తోంది.

జగన్ పర్యటించిన జిల్లాలో అనేక చోట్ల అభ్యర్ధులని ప్రకటించారు అయితే చీరాలలో జగన్ ప్రకటిస్తారు అనుకుంటే జగన్ ఘలక్ ఇచ్చాడు అయితే చీరాల నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న యడం బాలాజీ ఎంతో ఖర్చు పెట్టి యాత్రకి అన్ని సమకూర్చారు అయితే జగన్ అభ్యర్ధి విషయంలో స్పందిచక పోవడంతో బాలాజీ కూడా నిరాశతో ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఎవరు ఈ బాలాజీ అంటే అమెరికాలో స్థిరపడిన బాలాజీ బాలినేనికి సన్నిహితుడు చీరాలలో బాలినేని అండతోనే చక్రం తిప్పాలని అనుకున్నాడు.

అయితే శనివారం చీరాలలో జరిగిన సభలో జగన్ కంటే ముందు మాట్లాడిన బాలాజీ “నా ఆరాధ్య దైవం బాలినేని శ్రీనివాస రెడ్డి” చెప్పగానే జగన్ అతని చేతిలో నుంచీ మైక్ లాక్కుని.బాలాజీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

ఇదిలాఉంటే బాలినేని కూడా చీరాలలో బాలాజీ పేరుని సిఫారుసు చేస్తున్నాడు.అయితే తన మనసులో వేరే ఆలోచన వుండడంతోనే బాలాజీ పేరును జగన్ ప్రకటించలేదని ప్రచారం జరుగుతోంది.

స్థానికంగా ఈ సీట్ నాకే కావాలని పోటీ పడుతున్న వాళ్ళు కూడా లేరు.అలాంటిది జగన్ బాలాజీ పేరుని ప్రకటించక పోవడంతో తీవ్ర అసంత్రుప్తిలో ఉన్నారు బాలాజీ వర్గం.

ఈ సమయంలోనే ఆదివారం చీరాలలో జగన్ పాదయాత్రలో బాలినేని కనిపించలేదు.అసలు ఈ రోజు యాత్రలో ఆయన ఉండాలి.ఎందుకంటే చీరాలలో యాత్ర పూర్తి అయితే ప్రకాశం జిల్లాలో పాదయాత్ర పూర్తి అయినట్లే.ఆదివారం సాయంత్రానికి పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది…అంటే జిల్లా దాటి వెళ్ళే సమయంలో బాలినేని లేకపోవడం జగన్ పై ఉన్న కోపమేనని.

తన వర్గం వాడిన బాలాజీని ప్రకటించక పోవడంతో బాలినేని ఎంతో భాద పడ్డారని.ఎంతో అవమానానికి లోనయ్యారని అంటున్నారు బాలినేని అనుచరులు.

అయితే బాలాజీ కి గనుకా టిక్కెట్టు రాకపోతే బాలినేని అనూహ్యమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాసం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube