బాహుబలి వెబ్‌ సిరీస్‌ అసలు వచ్చేనా

బాహుబలి రెండు పార్ట్‌లు కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వారు బాహుబలి టైటిల్‌తో వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు సిద్దం అయ్యారు.ప్రవీణ్‌ సత్తారు మరియు దేవా కట్టాలు ఈ వెబ్‌ సిరీస్‌కు సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

 Baahubali, Baahubali Web Series, Rajamouli, 13 Episodes, Ott, Baahubali Web Seri-TeluguStop.com

రికార్డు స్థాయిలో ఈ వెబ్‌ సిరీస్‌కు బడ్జెట్‌ కేటాయించారు.నెట్‌ ప్లిక్స్‌ వారు ఈ వెబ్‌ సిరీస్‌ను స్ట్రీమింగ్‌ చేసేందుకు భారీ ఆఫర్‌ను కూడా ఇచ్చారు.

అయితే షూటింగ్‌ సమయంలో వెబ్‌ సిరీస్‌ క్వాలిటీ ఇంకా కంటెంట్‌ విషయంలో అనుమానాలు వ్యక్తం చేసిన నెట్‌ ప్లిక్స్‌ స్ట్రీమింగ్‌కు వెనుకాడుతుందట.

ఇప్పటి వరకు కోట్లు ఖర్చు చేసిన ఆర్కా మీడియా వారు ఇప్పుడు నెట్‌ ప్లిక్స్‌ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏం చేయాలో పాలుపోక జట్టు పీక్కుంటున్నారట.

దర్శకులు దేవా కట్టా మరియు ప్రవీణ్‌ సత్తారులు ఇద్దరు కూడా మళ్లీ కొన్ని సీన్స్‌కు సంబంధించిన రీ షూట్‌ను ప్లాన్‌ చేయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో మరింత శ్రద్ద పెడుతున్నారట.

Telugu Baahubali, Baahubali Web, Baahubaliweb, Rajamouli-

ఈ వెబ్‌ సిరీస్‌లో మొత్తం 13 ఎపిసోడ్స్‌ ఉంటాయట.

వాటిలో మొదటి ఎపిసోడ్‌కు రాజమౌళి దర్శకత్వం వహించాడు.బాహుబలి మొదటి పార్ట్‌కు ముందు ఏం జరిగింది అనే కథాంశంతో ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

వెబ్‌ సిరీస్‌లో నెట్‌ ప్లిక్స్‌ పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్కా మీడియా వారు మరో ఓటీటీకి దీనిని అమ్మే అవకాశం లేదు.దాంతో బాహుబలి వెబ్‌ సిరీస్‌ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి.

అసలు వచ్చేనా లేదో కూడా క్లారిటీ లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube